‘అంజనాపుత్ర’ క్రిష్ బలం ఇదేనా…

గమ్యం అంటూ డబ్బే కాదు జీవితం, మానవ విలువలు తో ‘గాలి శీను’ లా కూడా సంతోషం గా జీవించవచ్చు అని చెప్పినా..

వేదం అంటూ పక్క వాడికి అన్యాయం చేయకుండా బ్రతికే బ్రతుకు ఎంతో సంతృప్తినిస్తుంది అని సరోజ , కేబుల్ రాజా, నిజాయితీ కి దైర్యం ఉంటుంది అని పెద్దాయన ద్వారా…(పటేలా.. లెక్క కరెక్ట్, అంతే అనే సన్నివేశం)

కృష్ణం వందే జగద్గురుం (బి.టెక్ బాబు) ద్వారా.. లివింగ్ అఫ్ నేసీసీటీ నే కాదు జీవిత ప్రయాణం అంటే, మన వారి కోసం, మన తోటి వారి కోసం, మన మట్టి కోసం పోరాడటం కూడా జీవితమే అని దేశంలో జరిగిన మైనింగ్ మాఫియా ని చూపించినా.

కంచె ద్వారా మనుసులు ఉంది కలిసి ఉండటానికి కంచెలు వేసుకు బ్రతకటానికి కాదు అని చెప్తూ నిజమైన స్నేహాన్ని, ప్రేమ ని, దేశం పై ఉండే భక్తి ని ధూపాటి హరిబాబు ద్వారా చిత్రీకరించినా.

సినిమా అంటే మీడియా, మీడియా ద్వారా ఎంతో కొంత సమాజానికి ఎదో తెలియచేయాలి అనే తపన క్రిష్ ని మంచి డైరెక్టర్ ని చేసింది.

క్రిష్ మరియు నందమూరి బాలకృష్ణ తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగుజాతికి ఉన్న గొప్ప చరిత్రని, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ద్వారా మన ముందుకు తెస్తున్నారు. 

Related posts