అప్పట్లో ఒకడుండేవాడు సినిమా రివ్యూ.

అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో.

నటీనటులు: నారా రోహిత్‌.. శ్రీవిష్ణు.. తాన్య హోప్‌.. బ్రహ్మాజీ.. రాజీవ్‌ కనకాల.. ప్రభాస్‌ శీను.. జీవీ.. సత్యదేవ్‌ తదితరులు

సంగీతం: సాయి కార్తీక్‌

ఛాయాగ్రహణం: నవీన్‌ యాదవ్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌

రచన, దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర

సంస్థ: అరణ్‌ మీడియా వర్క్స్‌

‘అప్పట్లో ఒకడుండేవాడు’ కధ:

1992 నాటి కథ ఇది. అప్పట్లో ‘రైల్వే రాజు’ (శ్రీవిష్ణు) అని ఒకడుండేవాడు. క్రికెట్ అతని ప్రాణం. అమ్మ.. ఇల్లు.. క్రికెట్‌ తప్ప మరో ప్రపంచం తెలీదు. రంజీ కి ఆడటం తన జీవితాశయం. రంజీ జట్టులో రైల్వే రాజు స్థానం ఖాయమనుకొంటున్న దశలో.. తన జీవితంలోకి ఇంతియాజ్‌ అలీ (నారా రోహిత్‌) ప్రవేశిస్తాడు.

ఇంతియాజ్‌ అలీ నిజాయతీగల పోలీస్‌. నక్సలైట్లను ఏరి పారేయడమే ఇతని జీవితాశయం. ఓ నక్సల్‌ ముఠాకి సంబంధించిన కీలక సమాచారం రైల్వే రాజు దగ్గర ఉందన్న ఇంతియాజ్‌ అనుమానంతో కటకటాల పాలవుతాడు రాజు. అక్కడ్నుంచి రాజు జీవితమే మారిపోతుంది. క్రికెటర్‌ కావాల్సిన రాజు క్రిమినల్‌ ఎందుకు కావాల్సి వస్తుంది. ఆ తర్వాతేం జరిగింది? రైల్వేరాజుకీ ఇంతియాజ్‌కీ జరిగిన సమరంలో ఎవరు గెలిచారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కధనం:

కధ చెప్పే తీరును పరిశీలిస్తే రొటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ అమ్మాయి రైల్వే రాజు ఫొటో పట్టుకొని అతని గురించి సమాచారం తెలుసుకొనే ప్రయత్నంలో ఉంటుంది. కాసేపు గతం ఇంకాసేపు వర్తమానం ఇలా స్క్రీన్‌ ప్లే సాగింది. నక్సలైట్ల ఎంట్రీ వరకూ కథ\స్క్రీన్ ప్లే సాదాసీదాగానే సాగినా ఆ తరవాత సినిమా వేగం అందుకుంటుంది. నారా రోహిత్‌ పాత్ర ప్రవేశించటం శ్రీ విష్ణు హత్యా నేరంలో ఇరుక్కోవడం ఆరు బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొట్టి జైలు నుంచి బయటపడడం ఇవన్నీ ఉత్కంఠగా సాగినా రైల్వే రాజు ఎదిగిన తీరు మాత్రం సినిమాటిక్‌గా సాగింది. హీరోయిన్ మాత్రం పాటలకే పరిమితం.

ద్వితీయార్థంలో చాలాసేపటి వరకూ నారా రోహిత్‌ పాత్రే కనిపించదు. కాసేపు బోర్‌ కొట్టించినా. క్లైమాక్స్ లో దర్శకుడు తన పనితనం చూపించుకోగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కథకు పూర్తి న్యాయం క్లైమాక్స్‌లోనే జరిగింది. చివరి 25 నిమిషాలు సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అనే చెప్పాలి.

మొత్తంగా ట్రెండింగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్: 3.5/5

Related posts