భారీగా పెరిగిన లైసెన్స్ ఫీజులు…వాటి వివరాలు !!

పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకొక నిర్ణయం తో ప్రజలను బెంబేలు ఎత్తిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరొక షాక్ ఇవ్వడానికి సిద్దమయ్య్యింది. వాహనద్దరుల నెత్తి పై భారం మోపేందుకు రంగం సిద్దం చేస్కుంది కేంద్ర ప్రభుత్వం.

డ్రైవింగ్ లైసెన్సుల ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 29న నిర్ణయం తీసుకున్నది. వెంటనే దీనిని అమలు చేయాలని అన్ని రాష్ర్టాలకు సూ చించింది. అయితే ఆయా రాష్ట్ర రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్రాల ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కొత్త ఫీజులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దాదాపు 15 ఏండ్ల తర్వాత సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989లోని రూల్ 32, 81వ నిబంధనలను సవరించింది. పెరిగిన ఫీజులను వెంటనే అమలు చేయాలని సంబందిత రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ రేట్లు భారీగా పెరిగాయి.
వాటి వివరాలు మీ కోసం

లెర్నర్ లైసెన్స్ – 30 నుంచి 150

లైసెన్స్ రిపీట్ టెస్ట్ – 50 నుంచి 300

డ్రైవింగ్ లైసెన్స్ – 200 నుంచి 200

ఇంటర్నేషనల్ లైసెన్స్ – 500 నుంచి 1,000

అదనపు వాహనం లైసెన్స్ – ౩౦ నుంచి 500

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ – 50 నుంచి 200

రెన్యువల్ కాలపరిమితి దాటితే – 100 నుంచి 300

డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ – 2,500 నుంచి 10,000

డూప్లికేట్ డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ – 2,500 నుంచి 5,000

వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి:

మోటార్ సైకిల్ – 50 నుంచి 500

డూప్లికేట్ ఆర్సీ – 30 నుంచి 300

రెన్యువల్ – 80 నుంచి 300

త్రీవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ – 100 నుంచి 600

నాన్ ట్రాన్స్పోర్ట్ – 200 నుంచి 1,000

ట్రాన్స్ర్ పోర్టు – 300 నుంచి 1,000

మీడియం గూడ్స్ వెహికల్ – 400 నుంచి 1,000

మీడియం పాసెంజర్ – 400 నుంచి 1,000

హెవీ గూడ్స్ వెహికల్ – 600 నుంచి 1,000

హెవీ పాసెంజర్ వెహికల్ – 600 నుంచి 1,000

ఇంపోర్టెడ్ మోటర్ వెహికల్ – 800 నుంచి 5,000

ఇంపోర్టెడ్ మోటార్ సైకిల్ – 200 నుంచి 2,500

Related posts