సెల్ఫీ తీసుకుంటే…రూ.500 బహుమతి !!

స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంబించిన మొదట్లో ప్రధాని చీపురు పట్టుకుని రోడ్ మీదకు రావడం తో కొన్ని రోజులు దేశ ప్రజలంతా ఈ మహత్తర కార్యక్రమంలో స్వచ్ఛదంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా ముందుకి తీసుకువెళ్తుంది.

ఇప్పుడు స్వచ్చ భారత్ ను వినూత్నం గా మొదలు పెట్టె యోచన లో ఉంది మహారాష్ట్ర లోని ఒక గ్రామ పంచాయితీ. దానికి సంబంధించి ఒక ఆఫర్ ని కూడా వెల్లడించిందందోయ్. ఆరుబయట మల విసర్జన చేసే వారితో ఒక సెల్ఫీ తీసుకోండి రూ.500 గెలుచుకోండని ప్రకటించింది గ్రామ పంచాయతి. ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా అరికట్టేందుకే ఈ పథకానికి శ్రీకారం చుట్టామని పేర్కొంది గ్రామ పంచాయతి.

ఆరు బయట మల విసర్జన చేసే వ్యక్తులతో సెల్ఫీ తీసుకున్న వారికి రూ.500 బహుమతిగా ఇస్తామంటే, ఆరుబయట మలవిసర్జన చేసేవారు ఇలాగైనా సిగ్గుతో మారతారని భావిస్తోన్నట్టు తెలిపింది గ్రామ పంచాయతీ. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.