26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

జియో ఫోన్ బుక్ చేసుకోండిలా…

రిలయన్స్ జియో ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఒక పెను సంచలనం సృష్టించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.

4జీ ఫోన్ ఉచిత ఇంటర్నెట్, కాల్స్ అందిస్తూ టెలీకాం మార్కెట్లోకి జియో సృష్టించిన సంచలనాన్ని మరువక ముందే.. 4జీ ఫీచర్ ఫోన్ ప్రకటనతో మిగతా టెలీకాం సంస్థలు వణికిపోతున్నాయి.

రూ. 1500కే జియో ఫోన్ ఇస్తామని అంబానీ ప్రకటించడంతో టెలి కమ్యూనికేషన్ మార్కెట్ వర్గాల్లో వణుకు మొదలయ్యింది. అయితే ఫోన్ కోసం రూ.1500 డిపాజిట్ చేసి.. మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్ ప్రి బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభం అవుతాయి. కాగా.. ఎలా బుక్ చేసుకోవాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు.

రిలయన్స్ స్టోర్‌లో గానీ లేదంటే.. మై జియో యాప్ ద్వారా ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చని జియో స్పష్టం ప్రకటించింది. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారికి సెప్టెంబర్ నుంచి ఫోన్లను డెలివరీ చేస్తారు. ప్రతివారం 50 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంబానీ ప్రకటించారు.

ముందుగా బుక్ చేసుకున్న వారికే ఫోన్లు అందిస్తామని అలాగే 1860-893-3333 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా జియో ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ సూచించారు. అయితే ఈ జియో ఫోన్లో రూ. 153 ప్లానులో అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజ్‌లతోపాటు అపరిమిత డేటాను వాడుకునే వీలుంది. కాకపోతే రోజులో గరిష్టంగా 500 ఎంబీ డేటాను మాత్రమే వాడుకోవాలి. అందరికీ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు ఉన్న జియో ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు అంబానీ చెప్పుకొచ్చారు. ఈ ఫోన్ 22 భాషల్లో పని చేస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles