26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

ఖాతాదారులకు మరో షాక్ ఇచ్చేందుకు ఎస్‌బీఐ రెడీ !

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది.

ఇప్పటికే మినిమం బ్యాలెన్సు, ఆన్‌లైన్ చెల్లింపు సేవల ఛార్జీలను పెంచి వీటితో పాటు మరికొన్ని నిబంధనలు కఠినతరం చేసి ఖాతాదారులకి షాక్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఇప్పుడు పొదుపు ఖాతాల డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ వడ్డీ రేటును 0.5 శాతం (50 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. సోమవారం (జులై 31) నుంచే ఈ కొత్త వ‌డ్డీ రేట్లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎస్‌బీఐ తెలిపింది. ప్రైవేట్ బ్యాంకులన్నీ 6 శాతం వడ్డీ ఇస్తుండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకు అయ్యుండి 4 శాతం వడ్డీ రేటునే ఇవ్వడం సరికాదంటుంటే.. ఇప్పుడు దాన్ని కాస్తా 3.5 తగ్గించింది ఎస్‌బీఐ.

అయితే ఎస్బీఐ వాదనల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు తగ్గడం వ‌ల్లే వ‌డ్డీ రేట్లను త‌గ్గించిన‌ట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్‌లో ఎస్‌బీఐ షేరు 4 శాతం లాభాలతో ట్రేడ్‌ అయింది. రూ. కోటి వ‌ర‌కు ఉన్న సేవింగ్స్ డిపాజిట్ల‌పై గ‌తంలో 4 శాతం వ‌డ్డీ ఇస్తుండ‌గా.. తాజా నిబంధనల ప్రకారం దాన్ని 3.5 శాతానికి తగ్గించారు. రూ. కోటికి పైన ఉన్న డిపాజిట్లకు మాత్రం 4 శాత‌ం వ‌డ్డీనే ఎస్‌బీఐ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles