26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

ఉద్యోగులకి భారీ షాక్ ఇచ్చిన స్నాప్‌డీల్‌

రెండు ప్రముఖ ఇ-కామర్స్‌ పోర్టళ్లు… స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య ఒప్పందానికి తెరపడింది.

ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం అంశంపై ఇప్పటిదాకా జరిగిన, ఇప్పుడు జరుగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్లు స్నాప్‌డీల్‌ ప్రకటించింది. ఇక మీదట ఒంటరిగానే కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ నిన్న ప్రకటించింది. గతంలో స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ 900-950 మిలియన్‌ డాలర్ల ఆఫర్‌ ఇచ్చింది.

అయితే వారం రోజులుగా దీనిపై చర్చలు జరుపుతున్న స్నాప్‌డీల్‌… తాజాగా వాటిని నిలిపేస్తూ ఫ్లిక్‌కార్ట్ సంస్థకు షాక్ ఇచ్చింది. స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం ‘ఫ్రీఛార్జ్‌’ ను యాక్సిక్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందానికి తెరపడింది.

భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు స్నాప్‌డీల్‌ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌తో విలీన చర్చలను రద్దు చేసుకున్న కొద్ది సమయానికే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. స్నాప్‌డీల్ తాజాగా 80 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం.

స్నాప్‌డీల్‌‌లో గత ఏడాది జూలై నాటికి 9 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. ప్రస్తుతం ఈ సంఖ‍్య 1200లకు తగ్గింది. ఇప్పుడు మరింత మందిని తొలగించడానికి జాబితా సిద్ధం చేస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles