26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

బంగారం కొనేవారికి శుభవార్త

నిన్న ఊహించ‌ని విధంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. అదే స్థాయిలో బంగారం ధర తగ్గిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో రూ. 350 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 30,100కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ త‌గ్గ‌డం, స్థానిక బంగారు ఆభ‌ర‌ణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బంగారం ధ‌ర ప‌డిపోయింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు వెండి కూడా ప‌సిడి బాట‌లోనే ప‌య‌నించి ఈ రోజు రూ.500 త‌గ్గి, కేజీ వెండి ధర 40,600కు చేరింది.

మార్కెట్లో  8 గ్రాముల బంగారం రూ. 24,500గా ఉంది. ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గోల్డ్ రూ.350 తగ్గి రూ.30,100కు చేరుకుంది.10 గ్రాముల బంగారం రూ.29,950కి వచ్చింది. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధరలు 0.07 శాతం త‌గ్గి ఔన్స్‌కు 1,308.60 డాలర్లకు చేరింది. వెండి ధ‌ర‌లు 0.43 శాతం ప‌డిపోయి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా న‌మోదైంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles