26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

కొత్త కారు కొనాలి అనుకునే వారికి శుభవార్త

వస్తు సేవల పన్ను (జి ఎస్ టి) ప్రభావంతో దేశంలో కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ లోటుని భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి కార్ల కంపెనీలు. దసరా పండుగ సందర్భంగా ప్రముఖ కంపెనీలు ఆఫర్లతో వినియోగదారులని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కారు కొనాలి అనుకునే వారికి భారీ ఆఫర్లను ప్రకటించాయి కార్ల కంపెనీలు.

వివిధ కార్ల కంపెనీలు ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి…

మారుతి సుజుకీ
మారుతి సుజుకీ దేశంలో ప్రముఖ కార్ల కంపెనీ. పండుగ సందర్భంగా వినియోగదారులకి అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో 800 పై రూ. 40,000, వ్యాగన్‌ ఆర్‌ పై రూ. 55,000, ఆల్టో కె10 పై రూ. 55,000, సెలేరియో ఎఎంటి పై రూ. 55,000, ఎర్టిగా (డీజిల్‌) పై రూ. 50,000, ఓమ్ని (పెట్రోల్‌) పై రూ. 50,000, స్విఫ్ట్‌ డిజైర్‌ టూర్‌ ఎస్‌ (డీజిల్‌) పై రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చని మారుతి సుజుకీ ప్రకటించింది.

ఫోర్డ్‌
దేశీయ మార్కెట్ లో ఫోర్డ్‌ కంపెనీ కి మంచి పేరు ఉంది. ఈ కంపెనీ దసరా పండుగ ఆఫర్‌లో భాగంగా అన్ని కార్ల కి రూ. 10 వేల వరకు క్యాష్‌ ప్రయోజనం కల్పిస్తుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద రూ. 15,000 అందిస్తోంది. అంతేకాకుండా బంగారు నాణేన్ని కూడా ఇవ్వనున్నట్ట కంపెనీ చెబుతోంది.

హ్యుండయ్‌
హ్యుండయ్‌ కంపెనీ దసరా పండుగ ఆఫర్‌లో భాగంగా ఇయాన్‌ మోడల్‌ పై రూ. 55,000 వరకు ప్రయోజనాలు, క్యాష్‌ డిస్కౌంట్‌ రూ. 50,000 వరకు అందిస్తోంది. గ్రాండ్‌ ఐ10 (పెట్రోల్‌) పై రూ. 80,000 , రూ. 50,000 వరకు నగదు డిస్కౌంట్‌ ఇస్తోంది. ఎక్సెంట్‌ (పెట్రోల్‌/డీజిల్‌) పై రూ. 50,000 వరకు, రూ. 20,000 వరకు నగదు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. అంతే కాకుండా ఎలైట్‌ ఐ20 పై రూ. 25,000, టక్సన్‌ పై రూ. 70,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది.

టొయోటా
ఈ కంపెనీ తన సరికొత్త ప్లాటినం ఎటియోస్ పై రూ. 35,000, ఎటియోస్‌ లివా పై రూ. 30,000, ఎటియోస్‌ క్రాస్‌ పై రూ. 30,000, కొరొల్లా ఆల్టిస్‌ పై రూ. 40,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles