26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

షేర్ మార్కెట్ కి త్వరలో భారీ షాక్ ?

ఇటీవలి కాలం లో కనీవినీ ఎరుగని రీతిలో భారత షేర్ మార్కెట్ అంచనాలకి మించి దూసుకుపోతుంది .ఒక పక్క బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ౩౩ వేల మార్క్ దాటి దూసుకుపోతుండగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి పదివేల మార్కు దాటి సరిక్రొత్త రికార్డులు సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతుంది …

ఈ క్రమం లో కేవలం ఈ సంవత్సరం లో మదుపరుల సొమ్ము సుమారు ముప్పై లక్షల కోట్ల మేర సంపద పెరిగింది అనేది ఒక అంచనా …అయితే గత సంవత్సరకాలం గా ఆనందడోలికల్లో మునిగితేలుతున్న భారతదేశ మదుపరులకి రానున్న కాలం లో భారీ షాక్ తగలనున్నది అని షేర్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు …

అతి త్వరలోనే మన మార్కెట్లు భారీ కరెక్షన్ల కి లోను అవుతుంది అని అంచనా వేస్తున్నారు …నిపుణుల అంచనా మేరకు రానున్న జనవరి లో మార్కెట్లు భారీ ఎత్తున కుదేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది …కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు ఇప్పటికే అన్ని షేర్ల ధరలు ఆల్ టైం హై లో ఉన్నాయి కాబట్టి రానున్న కరెక్షన్ కాలం వరకు వేచి చూసి పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది అని సూచిస్తున్నారు

మరి నిపుణులు అంచనా వేస్తున్నట్లు జనవరి నాటికి కరెక్షన్ కి లోనవుతాయో లేదా ఇదే బుల్ ట్రెండ్ కొనసాగి మరింత పైకి ఎగబాకి కొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles