26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

ఫ్లిప్‌కార్ట్‌ మరో సంచలనం

ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి సంచలనానికి వేదికయ్యింది. ప్రస్తుతం దేశంలో ఎంతో ప్రముఖ ఈ కామర్స్‌ పోర్టల్‌గా మాత్రమే ఖ్యాతిగాంచిన ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు తొలిసారిగా దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్‌ రూపంలో వచ్చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ బ్రాండ్‌ అని నామకరణం చేసి విడుదల చేసింది.

‘బిలియన్‌ క్యాప్చర్‌ ప్లస్‌’ పేరుతో భారత మార్కెట్లోకి బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రవేశించింది. అయితే తొలిసారిగా మార్కెట్ లోకి తీసుకువస్తున్నప్పటికి ఈ ఫోన్ ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ అంతర్గత మొమరీ ఫోన్‌ ధర రూ.10,999గా నిర్ణయించగా.. 4జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మొమరీ మోడల్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది.

స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్‌ సందర్భంగా దాని ప్రొమోషన్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో ఈ బిలియన్‌ క్యాప్చర్‌ ప్లస్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశీయ మార్కెట్ లోకి ప్రవేశించిన ఈ ఫోన్‌ ఫీచర్లు ఇవే:

* 5.5 అంగుళాల తాకే తెర
* నూగట్‌ ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌
* 625 అక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రొసెసర్‌
* 3జీబీ, 4జీబీ ర్యామ్‌
* 13 మెగాపిక్సల్‌ + 13 మెగాపిక్సల్‌ వెనుక కెమెరాలు
* 8 మెగాపిక్సల్‌ ముందు కెమెరా
* 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles