26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

సిక్కోలులో వైసీపీ వీడియో జిమ్మిక్కులు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన టీడీపీ !!

తెలుగుదేశం పార్టీ త‌న వంతుగా కృషి చేస్తోంది.. సిక్కోలు జిల్లాలో గ‌తంలో ఉన్న పూర్వ వైభ‌వం ప్ర‌కృతి ప‌రంగా తీసుకురాక‌పోయినా, ప‌రిపాల‌న అభివృద్ది సంక్షేమం దిశ‌గా చేయ‌నుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున చెట్లు ప‌డిపోవ‌డంతో ప్లాంటేష‌న్ ఆవ‌శ్య‌క‌త అక్క‌డ ఎంత‌గానో ఉంది. ఇక ఇక్క‌డ ప్ర‌భుత్వం చేస్తున్న మంచి మాత్రం ప్రతిప‌క్షానికి క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ తోక మీడియా ఇక్క‌డ చేస్తున్న హ‌డావిడి అంతా ఇంతా కాదు. కోటి రూపాయ‌ల సాయం ప్ర‌క‌టించేసి ఉడ‌తా భ‌క్తి ప్ర‌ద‌ర్శిస్తే ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా.

100 మంది పొగుడుతుంటే ఇద్ద‌రు తిట్టే వీడియోల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించాలి అని సోష‌ల్ మీడియాలో విష ప్ర‌చారం చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. ముఖ్యంగా అది కూడా వైసీపీ డ‌బ్బులు ఇచ్చి కొంద‌రిని ఇలా తిట్టించాలి అని చేస్తున్నారు. వారు వైసీపీ సానుభూతి ప‌రులు అయితే చాలు వారిని టీడీపీ పై ఉసిగొలుపుతున్నారు. తాజాగా చేస్తున్న‌ ప్ర‌య‌త్నం కూడా అదే, ఓ ప‌క్క లోకేష్ కు ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌ల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇలా తిత్లి వ‌ల్ల బాధ‌ప‌డుతున్న వారికి ప్ర‌భుత్వం సాయం బాగా అందిస్తోంది అని చెబుతుంటే, మ‌రో ప‌క్క కావాల‌నే విషం చిమ్ముతోంది జ‌గ‌న్ పార్టీ.

ఆనాడు హుద్ హూద్ వ‌చ్చిన స‌మ‌యంలో ఒక్క కార్య‌క‌ర్త కూడా వైసీపీ నుంచి వ‌చ్చి ఓ రేకుల షెడ్డుని కూడా బాగు చేయ‌లేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది వీరి వ్య‌వ‌హారం. జ‌గ‌న్ కి తోడుగా ప‌వ‌న్, వీరి ఇద్ద‌రి సోష‌ల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగిస్తూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై, అలాగే మంత్రి లోకేష్ పై టార్గెట్ పెట్టుకున్నారు. కాని ప్ర‌జ‌లు మాత్రం అన్ని గ‌మ‌నిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వీరు చేస్తున్న ప్ర‌చారం ఎలా ఉన్నా జ‌నాలు కూడా వారికి చెబుతున్నారు.. నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందిస్తున్నారు. నీటిని అందిస్తున్నారు. క‌రెంట్ చాలా గ్రామాల్లో రావ‌డానికి నిద్రహారాలు మాని ఉద్యోగులు ప‌నులు చేస్తున్నారు.. ఇవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తున్నాయి.. మ‌రి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ కి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా ప్ర‌జ‌లు బుద్ది చెబుతారు. ఏమంటారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles