26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

బీసీల‌కు చంద్ర‌బాబు మ‌రో వ‌రం

ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల బాగు కోసం అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, అభివృద్ధిలో అన్ని వ‌ర్గాల‌ను భాగ‌స్వామ్యం చేసే దిశ‌గా కృషి చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు స‌మానంగా అభివృద్ధి చెందేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు చంద్ర‌బాబు. గ‌తంలో కొన్ని ప్ర‌భుత్వాలు కేవ‌లం కొన్ని సామాజిక వ‌ర్గాల అభివృద్ధికే మాత్ర‌మే పెద్ద పీట వేశాయి. కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోలేదు. కానీ చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌మ‌న్యాయం చేస్తూ, అంద‌రి అభివృద్ధికి పాటు ప‌డుతున్నారు. దీని కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీల‌కు చంద్ర‌బాబు త్వ‌ర‌లో మ‌రో గుడ్ న్యూస్ అందించ‌నున్నారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు టీడీపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలియ‌జేసేందుకు భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ముస్లిం సామాజిక వ‌ర్గం సంక్షేమానికి చేప‌డుతున్న  సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలిపేందుకు గుంటూరులో ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో నారా హ‌మారా-టీడీపీ హమారా పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది టీడీపీ . భారీ ఎత్తున నిర్వ‌హించిన ఈ స‌భ‌కు సీఎం చంద్ర‌బాబు హాజ‌రై, టీడీపీ ప్ర‌భుత్వం ముస్లింల కోసం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలియ‌జేశారు. అదే విధంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి, ఆయా సామాజిక వ‌ర్గం అభివృద్ధి కోసం టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తెల‌పాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే రాజమహేంద్రవరంలో న‌వంబ‌ర్ 25న బీసీల‌తో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ స్ధాపించిన ద‌గ్గ‌రి నుంచి ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గం టీడీపీకి అండ‌గా నిలుస్తుంది. దీంతో బీసీ అంటే తెలుగుదేశం. తెలుగుదేశం అంటే బీసీ’లు అన్న నినాదంతో… జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రెండు రోజుల పాటు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌య‌హో బీసీ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది టీడీపీ. బీసీల అభివృద్ధి కోసం టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలపై చంద్ర‌బాబు ఈ బ‌హిరంగ స‌భ‌లో చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌భ‌కు ముందు, తొలుత విజయవాడలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చంద్ర‌బాబు ఓ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

ఆ త‌ర్వాత ప్రతి జిల్లాలోను బీసీ సదస్సులు నిర్వహిస్తారు.కాగా, న‌వంబ‌ర్ 25న జ‌ర‌గ‌నున్న ఈ భారీ బ‌హిరంగ స‌భ‌లో బీసీల‌కు చంద్ర‌బాబు వ‌రం ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలని చంద్ర‌బాబు భావించారు.బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టిస్తార‌ని టీడీపీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles