26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

వైసీపీతో పొత్తుపై సంచ‌ల‌న బాంబ్ పేల్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న పార్టీలు… అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేస్తున్నాయి. వ‌చ్చే నెల‌లో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,జ‌న‌సేన త‌మ పార్టీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయ వేడి మ‌రింత రాజుకుంది. ఒక‌వైపు అభ్య‌ర్ధులు సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తులు ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగానే మారుతున్నాయి. ప్ర‌ధానంగా పోటీ టీడీపీ, వైసీసీ మ‌ధ్యే ఉండ‌గా… జ‌న‌సేన ప్ర‌భావం ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాస్త ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ జ‌ర‌గ‌నుండ‌టంతో జ‌న‌సేన వ‌ల్ల ఏ పార్టీకి ఎక్కువ న‌ష్టం చేకూరుతుంద‌నే దానిపై అనేక విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.


అయితే జ‌న‌సేన‌తో వైసీపీ పొత్తు పెట్టుకుంటుంద‌నే ప్ర‌చారం గ‌త మూడేళ్లుగా జ‌రుగుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై న‌రేంద్ర మోదీని జ‌గ‌న్‌, ప‌వ‌న్ లిద్ద‌రూ ప‌ల్లెత్తి మాట కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అన‌క‌పోవ‌డంతో.. వారిద్ద‌రు బీజేపీ చెప్ప‌చేతుల్లో న‌డుస్తున్నార‌నే టాక్ బ‌లంగా ఉంది. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం.. వైసీపీ, జ‌న‌సేన‌ను క‌లిపేందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసినట్లు గ‌తంలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. వైసీపీ, జ‌న‌సేన క‌లిస్తే టీడీపీని ఓడించ‌వ‌చ్చ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని, ఈ మేర‌కు సీట్ల‌కు సంబంధించి డీల్ కూడా పూర్త‌యిందంటూ గ‌తంలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్రమంలో జ‌న‌సేన‌తో పొత్తు కుదుర్చుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన‌తో పొత్తు కుదుర్చుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప‌వ‌న్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. జ‌న‌సేన‌తో పొత్తు కోసం వైసీపీ రాయ‌బారం చేస్తుందంటూ ప‌వన్ బాంబు పేల్చారు. జ‌న‌సేన‌కు సీట్లు రావంటూనే త‌మ‌తో పొత్తు కోసం వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తుందని, మ‌ధ్య‌వ‌ర్తుల‌తో మాట్లాడిస్తున్న విష‌యాన్ని ప‌వ‌న్ బ‌య‌ట‌ప‌డ్డారు. మొత్తానికి వైసీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటుంద‌ని గ‌తంలో వార్తలు వ‌చ్చిన నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles