25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

అనవసరంగా బాలయ్యతో పెట్టుకున్నారు !!

దాసరి అంటే అక్కినేనికి హిట్ సినిమాలు, దర్శకేంద్రుడు అంటే అన్న ఎన్టీఆర్ కు హిట్ సినిమాలు అంటారు.. ఇక ఇప్పుడు బోయపాటి అంటే కచ్చితంగా బాలయ్యకు మార్క్ పడింది. మరి బాలయ్యకు రాసే స్క్రిప్ట్ ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో చేయిస్తే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణ వినయ విధేయ రామ అంటున్నారు జనం.. కొన్ని కొన్ని సీన్లు బాలయ్య చేస్తే అందరికి నచ్చుతాయి, ఇక కొన్ని డైలాగులు రజనీ చెబితేనే జనాలకు నచ్చుతాయి. కొన్ని ఫైట్లు బాలయ్య చేస్తేనే జనాలు జీర్ణించుకుంటారు.

కొన్ని డ్యాన్సులు మెగా స్టార్ చేస్తేనే చూడటానికి బాగుంటాయి.. ఇలా కొందరికి ఓ మార్క్ అనేది ఉంటుంది.. అలా సీమ ఫ్యాక్షన్ మాస్ ఎలిమెంట్ ఉన్న చిత్రాలు అంటే బాలయ్య దగ్గరకే కథ రావాలి.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ తన ఇమేజ్ ఈ సినిమాతో చాలా కిందకి గ్రాఫ్ వేయించుకున్నాడు అంటున్నారు.. అయితే ఇలా సీన్లు చేయాలి అని ఆ దర్శకుడు చెప్పిన సమయంలో ఆ టాప్ హీరోకు తెలిసిపోతుంది. ఇది మరీ ఓవర్ గా ఉంది జనాలు రిసీవ్ చేసుకుంటారా అని, అలా మార్పులు చేసుకుంటారు, కాని రామ్ చరణ్ మక్కీకి మక్కీ బోయపాటి చెప్పింది చేసేవారు.. మరి ఓవర్ వయెలెన్స్ తో రచ్చ చేయించారు.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ వార్ అయితే కనిపిస్తోంది.. ఇక మాస్ పల్స్ పట్టుకున్న ఈ బోయపాటి తన డాక్టరేట్ ను మెగా పవర్ స్టార్ తో ఎక్కడకి పంపాడో చూడాలి అంటున్నారు అభిమానులు.

ఇక ఈ చిత్రంలో కొన్ని సీన్లు అయితే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన సన్నివేశాలు, అంటే తొడకొడితే ట్రైన్ ఆగడం లాంటి సీన్లకు మించి వినయ విధేయ రామలో పెట్టాడు బోయపాటి. దీంతో చరణ్ ని ఈ సీన్లలో చూడలేకపోతున్నారు అభిమానులు… అన్నయ్య ప్రమాదంలో పడే సీన్ చూస్తే.. చరణ్ గ్లాస్డోర్లు పగల గొట్టి మరీ, ఎయిపోర్ట్ నుండి బయటకు వచ్చి, రైల్వే స్టేషన్ కి వెళ్ళే టైమ్ లేక వంతెన మీద నుండి ఏకంగా రన్నిగ్ ట్రైన్ ఎక్కడం.. ఇక ఇలాంటివి ఇప్పుడు యంగ్ హీరోలు ఎవరూ ట్రై చేయడం లేదు అసలు ఇలాంటివి దర్శకులు కూడా పెట్టడం లేదు మరి బోయపాటి ఈ సీన్ ఎలా ఆలోచించాడు అనేది మాత్రం పెద్ద ఆలోచన.

అలాగే విలన్ సోదరుల తలలు నరికితే, గాల్లో పైకి ఎగిరిన తలల్ని అక్కడే ఎగురుతున్న గ్రద్దలు పట్టుకుపోవడం.. విషపూరితమైన పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం వామ్మో చెప్పుకుంటూ పోతే మొత్తం అవార్డులు రివార్డులు ఈ ట్రోల్స్ కు ఇవ్వాలి అనేలా ఉంది సోషల్ మీడియాలో, పైగా నందమూరి డైరెక్టర్ వర్సెస్ మెగా హీరో అనేలా కూడా వార్ ముదిరిపోయింది. ఇక కామెంట్లు కూడా అనవసరంగా బాలయ్యతో పెట్టుకున్నారు సినిమా కూడా బాలయ్య డైరెక్టర్ ఇలా తీశాడు అని అంటున్నారు. సో ట్రోలింగ్ లో ఈ ఏడాది ఈ సినిమా మొదట వచ్చింది అంటున్నారు ట్రేడ్ పండితులు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles