26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

జగన్ పై కోలుకోలేని పంచ్ వేసిన చంద్రబాబు !!

రెస్పెక్ట్ లేకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పై కామెంట్లు చేస్తారు అని ఏ నాటినుంచో విమర్శలు ఉన్నాయి.. ఇక జగన్ తరపున నేతలు ఆ పార్టీ కార్యకర్తలు కూడా సీఎం స్ధాయిలో ఉన్న చంద్రబాబు పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా విపరీతంగా చేస్తూ ఉంటారు.. ఇక ఇలాంటి వ్యాఖ్యలు వల్లే నంద్యాలలో ఓటమి జగన్ కు పరిచయం అయింది అయినా తీరు మారలేదు అనేది యాత్రలో స్పష్టంగా కనిపించింది అని సైకిల్ సఫారీలు అంటూ ఉంటాయి.

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి. జగన్ పై అవినీతి కేసులు ఎందుకు ఉన్నాయి, ఆయన చేసిన అవినీతి వల్లే అవి ఉన్నాయి. ఆయన మెడకు కేసులు చుట్టుకున్నాయి.. ఇక ఆయన సీఎం అవుతా అని అంటున్నారు, సీఎం అయినా సరే కచ్చితంగా జైలుకి వెళ్లవలసిందే అని, ఇది తప్పదు అని అవినీతి ఆరోపణలపై ఆయన విమర్శించారు… ఇప్పటికే ప్రతీ వారం కోర్టుకు వెళుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, ఇప్పుడు సీఎం అవుతా అని అంటున్నారు. అసలు ఈకేసులు అన్నీ ఫైనల్ గా విచారణ జరిగితే, మరోసారి జైలుకి వెళ్లక తప్పదు అని, సీఎంగా ఉన్న జగన్ జైలుకి వెళతారు అని చంద్రబాబు అన్నారు.. ఇక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జగన్ 16 నెలల జైలు శిక్ష సీన్ గుర్తు వస్తోంది.. అయితే అభియోగాలు తప్పు అని అంటున్నారు, మరి 16 నెలలు జైలులో ఎందుకు జగన్ ఉన్నారు అనేది కూడా 2014 ఎన్నికల సమయంలో ఓ ఫ్యాక్టర్ గా ప్రజలు ఆలోచించారు.

నెల్లూరు జిల్లాలో పర్యటించిన క్రమంలో జన్మభూమి, మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, జగన్ వల్ల అనేకమంది జీవితాలు బలయ్యాయని, ఎందరో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు రోడ్డున పడ్డారని, దీంతో జగన్ అధికారంలోకి వస్తే.. తాము కూడా జైలుకు వెళతామన్న భయంతో, పలువురు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళిపోతున్నారని చంద్రబాబు అన్నారు.. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను వైరల్ అవడమే కాదు కొందరిని ఆలోచింప చేస్తున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles