25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

చిరు, రామ్ చరణ్ మోసం చేశారు అంటున్న ఉయ్యాలవాడ కుటుంబీకులు…!

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి వచ్చే నెల 2న విడుదలకి సిద్ధం అయ్యిన సైరా నరసింహా రెడ్డి సినిమా పై తీవ్ర వివాదం నెలకొన్నది…

వివరాల్లోకి వెళితే.. సైరా సినిమా మొదలు పెట్టే ముందు ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన వారు ఆ సినిమా తీయటం పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు… తమ అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారు అని దుయ్యబట్టారు , అప్పట్లో ఈ వివాదం కొన్ని రోజుల బాటు నడిచినా ఆ తరువాత సద్దుమణిగింది… అయితే ఆ వివాదం సద్దుమనగటానికి గల కారణాలు తెలియకపోయినా గొడవ అయితే ఆగిపోయింది కదా అని మెగా అభిమానులు సంతోషించారు…

ఇప్పుడు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోని విడుదలకి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ గొడవ మళ్ళీ రాజుకుంది… ఈ సినిమా చిత్రీకరణకి ముందు సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు తమకి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి తమ పని అయిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు అని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారు… సినిమా మార్కెట్ లో తమ కుటుంబానికి చెందిన వారికి 10 శాతం లబ్ది చేకూరేలా హామీ ఇచ్చిన సినిమా నిర్మాణ సంస్థ ఇప్పుడు ఆ విషయం అడుగుతుంటే ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటున్నారు అని వాపోతున్నారు… వారు హామీ ఇచ్చిన ప్రకారం తమ కుటుంబానికి సుమారు 50 కోట్లు నిర్మాత నుంచి తమకి రావాల్సి ఉంటుంది అని డిమాండ్ చేస్తున్నారు… అలానే మా దగ్గర నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి చెందిన అపురూపమయిన కొన్ని ఆధారాలు తీసుకోవటమే గాక తమ ప్రాంతాన్ని , ఇళ్ళని షూటింగ్ కోసం వాడుకొని ఇప్పుడు మోసం చేయటం తగదు అని… వారు ఇచ్చిన హామీలు అన్ని రాతపూర్వకంగా ఉన్నాయి అని తమకు న్యాయం జరిగేవరకు ఎటువంటి పోరాటానికి అయినా సిద్ధంగా ఉన్నాము అని వారు సినిమా యూనిట్ ని హెచ్చరిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles