26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

చంద్రబాబు పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…!!

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇతరులను పొగిడినా… తమకు అనుకూలం అయ్యేలా మాట్లాడటంలో, తమకు క్రెడిట్ వచ్చేలా మాట్లాడటంలో ఈ దేశంలోనే టీఆర్ఎస్ నాయకులది ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవాలి. హైదరాబాదు అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు ప్రస్తావన తేకుండా మాట్లాడటం అనేది అసాధ్యం. చంద్రబాబు పై ఎన్ని విమర్శలు చేసినా… చంద్రబాబు చేసిన ఘనతను మెచ్చుకోవడంలో టీఆర్ఎస్ వాళ్లు ముఖ్యంగా కేటీఆర్ ఏ మాత్రం మొహమాట పడరు. రాజకీయంగా చంద్రబాబుతో టీడీపీతో ఎన్ని విభేదాలున్నా చంద్రబాబు సాధించిన వాటికి మాత్రం ఆయన ఎపుడూ క్రెడిట్ ఇస్తూనే ఉంటారు.

ఇటీవల హైదరాబాదు వివిధ రంగాల్లో ప్రస్తుతం ఎలా పరుగులు పెడుతుందో వివరించిన కేటీఆర్ పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. అత్యంత కీలకమైన జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టును తాము విస్తరించామని.. అయితే దానిని ప్రారంభించింది మాత్రం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరు సాధించిన వాటికి వారికే క్రెడిట్ ఇవ్వడం మా లక్షణం అని, చంద్రబాబు తెచ్చిండు కాబట్టి చంద్రబాబు పేరే చెబుతాం అంటూ కేటీఆర్ అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు సైలెంటయ్యారు.

గతంలో కూడా ఐటీకి పునాది వంటి మైక్రోసాఫ్ట్ తెచ్చింది చంద్రబాబే అంటూ… అది ఆయన ఘనతే కేటీఆర్ కీర్తించిన విషయం తెలిసిందే. ఇలా ఏ సందర్భంలో హైదరాబాదు గురించి మాట్లాడినా… చంద్రబాబు పేరు ప్రస్తావించక తప్పని పరిస్థితి. హైదరాబాదు గురించి చంద్రబాబు చెబితే… అది డబ్బా అని వైసీపీ ఆరోపిస్తుంది గాని స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే తరచుగా దానిని అంగీకరిస్తు వస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles