25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

కరెంటు కోతల పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు…!!

ఏపీలో విద్యుత్ కోతలు ఉన్న మాట నిజమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొరత గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వచ్చినప్పుడు… ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొరత తగ్గిందని చెప్పారు. ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు గత చంద్రబాబు ప్రభుత్వం పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు…

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారని ఆరోపించారు. తాను చేపట్టిన పురపాలక శాఖ విషయానికొస్తే, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.15 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భారీగా బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా..? అంటూ ప్రశ్నించారు. ఇక, రహదారులపై ఉండే అనాథల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles