35 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

మరోసారి ఆదర్శంగా నిలిచిన బాలయ్య…

అభిమానులు ప్రేమగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ ఒక పక్క తన సినిమా షూటింగ్ లలో బిజీ బిజీ గా ఉంటూ మరో పక్క తన తల్లి పేరు మీద స్థాపించిన క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా నిరంతరం పర్యవేక్షిస్తూ మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా ఎప్పటికప్పుడు నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలు గురించి అధికారులతో సమీక్షలు జరుపుతూ వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారికి అండదండగా నిలుస్తూ ఉంటారు… అయితే ఎక్కువగా ప్రచారానికి అంత ప్రాధాన్యత ఇవ్వని ఆయన చేసే పనులు మరుగున పడిపోతూ ఉంటాయి… తన అభిమానులు ఎప్పుడన్నా అదుపు తప్పి క్రమశిక్షణగా లేకపోతే వారిని కొట్టటానికి కూడా వెనుకాడని ఆయన అదే విషయం పై విపరీతమయిన ప్రచారం పొందుతూ ఉంటారు… అయితే అభిమానులు మాత్రం ఆయన కొడితే మేము కొట్టించుకుంటాం మీకు బాధ ఎంటి అని ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు..

అలానే ఆయన కొట్టినప్పుడు విపరీతంగా ప్రచారం చేసే వారు ఆయన చేసే మంచి పనులకి అదే స్థాయిలో ఎందుకు ప్రచారం చేయరు అని ప్రశ్నిస్తూ ఉంటారు… అవన్నీ గతం, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా పై పోరాటం చేస్తున్న సందర్భంలో బాలయ్య ఇప్పటికే తన వంతుగా 1 కోటి 25 లక్షల భారీ విరాళం ఇవ్వటమే కాకుండా తాను చైర్మన్ గా ఉన్న ఆసుపత్రిలోని స్టాఫ్ అందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చారు… ఇప్పుడు తాజాగా ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన ఆయన హిందూపురంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టాలి అని కొరటమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టీ పని చేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకి, మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి తన సొంత ఖర్చుతో PPE kits మరియు ఆసుపత్రిలో ఆవసరం అయిన ventilators తానే స్వయంగా అందిస్తా అని తెలిపారు… ఈ క్రమంలో ఆయన ప్రజాప్రతినిధులకు సైతం ఆదర్శంగా నిలిచారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles