27.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

UPDATE: ఏపీలో తాజా పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్ గత నలభై రోజులుగా లాక్ డౌన్ లో ఉన్నా కేసులు మాత్రం ఎక్కడా అదుపులోకి వచ్చినట్లు కనిపించటం లేదు.. అధికారులు, పోలీసులు నిద్రాహారాలు మానేసి ఎంత కష్టపడ్డా కేసులు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి… కొద్ది సేపటి క్రితం విడుదల అయిన బులెటిన్ ప్రకారం ఈ రోజు కొత్తగా 67 కేసులు నమోదు అయ్యాయి..

అందులో కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలు ముందు వరసలో ఉన్నాయి, గత 24 గంటల్లో నమోదు అయిన 67 కేసుల్లో ఈ మూడు జిల్లాలోనే 56 కేసులు నమోదు అయ్యాయి అంటే ఆ మూడు జిల్లాల్లో తీవ్రత ని అర్థం చేసుకోవచ్చు… జిల్లాల వారీగా తాజా కేసుల సంఖ్య చూస్తే కర్నూలు జిల్లాలో 25, గుంటూరు 19, కృష్ణా జిల్లాలో 12, విశాఖపట్నం జిల్లాలో 06, కడప జిల్లాలో 04, చిత్తూర్ జిల్లాలో 01 కేసులు నమోదు అవగా… 7 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు అవ్వకపోవటం శుభపరిణామం… మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 1650 కేసులు నమోదు అవ్వగా, 524 కేసులు డిశ్చార్జ్ అయ్యారు… అంటే రాష్ట్రంలో మొత్తంగా 1093 ఆక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు 33 మంది చనిపోయారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles