25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

బ‌రువును పెంచే ఉద‌య‌పు చెత్త అల‌వాట్లు..

బరువు పెరగడం నేడు ఒక సాధారణ సమస్య. జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు పెరుగుతుంటారు. అయితే వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవ‌డం ద్వారా బరువును నియంత్రించవచ్చు. అయితే చాలా మందిలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనిగా మారుతుంది. బరువు పెరగడానికి సాధారణంగా అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు బరువు పెరగడమ‌నేది మందులు మరియు వ్యాధుల వల్ల కూడా జ‌రుగుతుంది. కొన్నిసార్లు శారీరక శ్రమ తగ్గడం వల్ల కొవ్వు పేరుకుపోయి బ‌రువు పెరుగుతారు. దీనికితోడు ఉద‌యాన్నే మ‌న‌కు ఉండే కొన్ని కొన్ని చెడు అలవాట్లు బరువు పెరగడానికి కారణమవుతాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అతి నిద్ర
అతి నిద్ర బరువు పెరగడానికి దారితీస్తుంది. వాస్తవానికి రాత్రి పూట తొమ్మిది గంటల క‌న్నా ఎక్కువసేపు నిద్ర‌పోతే ఓవర్ స్లీపింగ్‌గా పరిగణిస్తారు. ఏడు గంటలపాటు నిద్ర‌పోతూవుంటే అది ఆరోగ్య‌క‌ర‌మైన విధానం అనిపించుకుంటుంది. అధిక నిద్ర కారణంగా ఊబకాయం వేగంగా పెరుగుతుంది. పగటిపూట నిద్రపోవ‌డంకూడా బరువును పెరిగేలా చేస్తుంది.

అల్పాహారం విస్మ‌రిస్తే…
ఉద‌యం ఎన్నిప‌నులు ఉన్నా అల్పాహారాన్ని విస్మ‌రించకూడ‌దు. వాస్తవానికి అల్పాహారం తీసుకోకపోవడం జీవక్రియను ప్రభావితం చేస్తుంది. శరీర అంతర్గత గడియారం గందరగోళంలో పడిపోతుంది. ఈ కారణంగా బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరం రోజంతా అలసటకు గుర‌వుతుంది. మరియు ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలనే కోరిక పుడుతుంది. ఇది బరువు పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది.

తగినంత నీరు తాగక‌పోతే…
ఉద‌యాన్నే ఒక గ్లాసు నీరు తాగ‌డం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో సమతుల్యతను కాపాడుకోవడానికి నీరు సహాయపడుతుంది. తద్వారా త‌ర‌చూ ఆకలి వేయ‌దు. అలాగే తగినంత నీరు తాగడం వల్ల కేలరీలు బ‌ర్న్ అయి, జీర్ణక్రియ పెరుగుతుంది. ఇది శరీరం నుండి మాలిన్యాల‌ను బయటకు పంపిస్తుంది. ఉదయం నీరు తాగకపోవడం వల్ల బరువు పెరిగే అవ‌కాశాలున్నాయి.

మేలు చేసే ధ్యానం
ఉదయాన్నే ధ్యానం చేయడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు త‌గ్గుతుంది. నిజానికి, ధ్యానం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలు అసమతుల్యమైనప్పుడు, ఆకలి ఎక్కువగా క‌లుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ధ్యానం అనేది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

సాగదీయడం లేదు
వ్యాయామాలకు ముందు మరియు తరువాత స్ట్రెచ్చింగ్ ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం చాలా ముఖ్యం. ఇది నొప్పి మరియు గాయాల‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి స్ట్రెచ్చింగ్ ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం ఎంతో అవ‌స‌రం. ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు స్ట్రెచ్చింగ్ ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం బరువు తగ్గడానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఉద‌యం పూట మంచి అల‌వాట్లు లేక‌పోతే బ‌రువు త‌ప్ప‌నిస‌రిగా పెరుగుతారు. అలాగే జీవనశైలి అస్త‌వ్య‌స్తంగా ఉన్నాకూడా ఊబ‌కాయం ప్రాప్తిస్తుంది. బరువు త‌గ్గాల‌ని అనుకునేవారు ఉదయాన్నే లేచి, త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles