36.6 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

ఎన్టీఆర్ అభిమానులకు రాజమౌళి షాకింగ్ సర్ప్రైజ్…

అశేష తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం ఈ రోజు…ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు ఒక పక్క సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కొత్త రికార్డులకు బాట వేస్తుండగా సెలెబ్రిటీల నుంచి కూడా వందలాదిగా ఆయనకి విషెస్ వస్తున్నాయి…

అయితే గత రెండు రోజుల నుండి ఆయన అభిమానులు కొంత నిరుత్సాహంతో ఉన్న మాట వాస్తవం…దానికి కారణం లేకపోలేదు… కొద్ది రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ తో కలసి నటిస్తున్న రామ్ చరణ్ కి అద్భుతమయిన టీజర్ రూపంలో గిఫ్ట్ ఇచ్చిన ఆ సినిమా టీమ్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకీ ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేక పోతున్నామని… లాక్ డౌన్ కారణంగా ఈ సమస్య తలే ఎత్తింది అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది… ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహ పడ్డారు…

అయితే ఎప్పటికి అప్పుడు తన సినిమా ప్రమోషన్ల విషయంలో నూతన ఒరవడి సృష్టించే రాజమౌళి మాత్రం ఆ ప్రకటన వ్యూహాత్మకంగా చేసినట్లు తెలుస్తుంది… నిరుత్సాహంతో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకి సర్ప్రైజ్ గా సాయంత్రం లోపు ఒక టీజర్ రిలీజ్ చేసి వారిని మరింత ఆనంద పరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది… మరి ఈ రోజు రాత్రి 12 గంటల లోపు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తుందో వేచి చూద్దాం..

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles