29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

ఫుల్ స్పీడుతో క‌రోనా కేసులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి !

దేశంలో కరోనా కేసులు, వాటి వ్యాప్తి, అనంత‌ర ప‌రిణామాల గురించి ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. వృత్తిపరంగా లేదా ఇంటి పనుల కోసం బయటకు వెళ్లాల్సి వ‌చ్చిన‌పుడు వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ‌, భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు, శానిటైజర్లు, గాగుల్స్ మొద‌లైన‌వి రక్షణ కోసం త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించాల్సిన అవ‌స‌రం ఉంది. కరోనా సంక్రమణ ఇప్పుడు దేశంలో క‌మ్యూనిటీ స్థాయికి వచ్చింది. ఈ కారణంగా ప్రతిరోజూ మ‌న‌ల్సిమ‌నం కాపాడుకోవాలి. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు దేశం చాలా వేగంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ప్రపంచంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసుల గ్రాఫ్‌లో భార‌త్ ఆరో స్థానానికి చేరుకుంది.

మన దేశ జనాభా అధిక‌మైనందున కేసులు ఇదే వేగంతో పెరిగితే పరిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావ‌డం క‌ష్ట‌మ‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రభుత్వం చేసిన ముంద‌స్తు ప్రయత్నాల కార‌ణంగా దేశంలో కరోనాకు గరిష్ట స్థాయికి చేరుకోలేదు. ప్రభుత్వ స్థాయిలో ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరగకుండా ఆపేస్తానని ఈ దేశంలోని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేసే వరకు ఈ ప్రయత్నాలు స‌ఫ‌లం కావు. క‌రోనా నివార‌ణ‌కు ప్రతీ ఒక్క‌రూ ఏమి చేయాలో తెలుసుకుందాం. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ముందు ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కొని, త‌రువాత ముక్కు యొక్క రెండు నాసికా రంధ్రాలపై ఆవ నూనెను రాయండి. త‌రువాత‌ శుభ్రమైన మాస్క్ ధ‌రించండి.

మాస్క్ ధ‌రించ‌డం వ‌ల‌న దద్దుర్లు, మొటిమలు లేదా దురద సమస్య వ‌స్తే, అప్పుడు ముఖానికి యాంటీఅలెర్జిక్ క్రీమ్ రాసుకోవాలి. తలకు సమ్మర్ క్యాప్ ధరించండి. ఇది మీ జుట్టులోకి కరోనా వైరస్ చొర‌బ‌డ‌కుండా చూస్తుంది. అలాగే ముఖాన్ని సూర్యరశ్మి నుండి కాపాడుతుంది. క‌రోనా వైరస్ ముక్కు మ‌రియు నోటి ద్వారా మాత్రమే కాకుండా కళ్ళ ద్వారా కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే గాగుల్స్ ధ‌రించాలి. ఇంటికి చేరుకున్నాక దుస్తులు మార్చుకుని, చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ త‌రువాత‌న‌నే ఇంటిలోని ఏదైనా వ‌స్తువును తాకాలి. వీలైతే, రాత్రి పడుకునే ముందు స్నానం చేయండి. ఇది పరిశుభ్రతను ప‌రిర‌క్షిస్తుంది. మంచి నిద్ర‌ను అందిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles