29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

ఢిల్లీ సీఎంకి కరోనా లక్షణాలు..

కరోనా వైరస్‌తో క‌కావిక‌ల‌మ‌వుతున్న ఢిల్లీ నుంచి మ‌రో ఆందోళన కలిగించే వార్త వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. కేజ్రీవాల్‌ తేలికపాటి జ్వరం, గొంతు నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. ఇవి క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు కావ‌డంతో వైద్యులు ఆయ‌న‌కు కరోనా ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ముందుజాగ్రత్త చ‌ర్య‌గా కేజ్రీవాల్‌ను హోంక్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో అసింప్టోమాటిక్, ప్రీ-సింప్టోమాటిక్ కేసుల కరోనా పరీక్షల‌ను నిషేధించింది.

రోగ లక్షణాలు క‌లిగిన‌ అనుమానితులకు మాత్ర‌మే క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ కేజ్రీవాల్ అనారోగ్య స్థితిని ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా సీఎంతో పరిచయం ఉన్న వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలావుండ‌గా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం నాటికి ఢిల్లీలో సుమారు 29 వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు 10,999 కరోనా బాధితులు కోలుకున్నారు. 17,125 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం తెలిపిన వివ‌రాల ప్రకారం, 12,213 కరోనా బాధితులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మృతుల సంఖ్య 812కు చేరుకుంది.

ఢిల్లీలో కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య 169కి పెరిగింది. రాబోయే రెండు వారాల్లో రాజధానిలో కరోనా కేసులు రెట్టింపు అవుతాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. వీటన్నిటి మధ్య షాపింగ్ మాల్స్, మతపరమైన ప్రదేశాలు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. అయితే హోటళ్లు, బాంకెట్ హాల్స్‌ మూసివేసివుంచ‌నున్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులలో ఢిల్లీవాసుల‌కు మాత్రమే చికిత్స అందిస్తార‌ని కేజ్రీవాల్ చెప్పారు. అయితే మిగిలిన‌వారు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులైన ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్‌, రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రు‌ల‌లో చికిత్స పొందే అవ‌కాశం క‌ల్పించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles