29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

క‌రోనాకే కంగుతినిపించిన చిన్నారి..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని‌ బయానా ప్రాంతం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఇదే ప్రాంతంలోని క‌సాయీ పాడాకు చెందిన 11 ఏళ్ల కాసిం అనే బాలుడు కరోనా బారిన ప‌డ్డాడు. ఫ‌లితంగా అ చిన్నారిని ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. 52 రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆసుపత్రిలో చికిత్స పొందిన‌ప్ప‌టికీ, కాసిం కరోనా నుంచి కోలుకోలేదు. ఆ చిన్నారికి 12 సార్లు నిర్వ‌హించిన వైద్య‌ పరీక్షల్లోనూ పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో వైద్యులు కూడా ఆందోళ‌న‌కు లోన‌య్యారు. అయితే ఎట్ట‌కేల‌కు కాసిం కరోనాపై జ‌రిగిన యుద్ధంలో విజయం సాధించాడు. ఆ చిన్నారికి 13వ సారి నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది.

దీంతో ఆ చిన్నారితో పాటు వైద్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాసిం ఉంటున్న‌ప్రాంతంలో 99 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఈ ప్రాంతాన్ని కరోనా హాట్ స్పాట్‌గా గుర్తించారు. ఆ సమయంలో కాసిం కూడా క‌రోనా పాజిటివ్‌గా ఉన్నాడు. అతని తల్లిదండ్రులు కూడా పాజిటివ్ అయిన‌ప్ప‌టికీ, ఆసుప‌త్రిలో చికిత్స పొందాక‌ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. అయితే కాసింకు 12 సార్లు నిర్వ‌హించిన కరోనా పరీక్షల్లోనూ పాజిటివ్ రిపోర్టు రావ‌డం విశేషం. ఇది వైద్యుల ఆందోళనను మరింతగా‌ పెంచింది.

అయితే కాసింకు 13వ సారి నిర్వ‌హించిన క‌రోనా వైద్య ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది. అలాగే 13వ‌, 14వ వైద్య ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన త‌రువాత ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఎట్ట‌కేల‌కు 52 రోజుల తరువాత కాసిం ఇంటికి చేరుకున్నాడు. తాను కరోనా వార్డులో చాలా కాలం పాటు ఉండాల్సి వ‌చ్చిందని, దీంతో త‌న త‌ల్లిని మిస్స‌య్యాన‌ని కాసిం తెలిపాడు. ఇంటికి చేరుకున్న తరువాత కాసిం తన తల్లితో ఆనందంగా ఉన్నాడు. కరోనా బాధితుడైన‌‌ 11 ఏళ్ల కాసిం వైద్యులను ఎంత‌గానో ఆశ్చర్యపరిచాడు. ఈ చిన్నారిపై పరిశోధనలు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణ‌యించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles