29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

క‌రోనా క‌ట్ట‌డి: ‌గోవాలో అలా.. రాజ‌స్థాన్‌లో ఇలా.. మ‌హారాష్ట్ర‌లో మ‌రోలా !

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గోవా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను గోవా సర్కారు చాలా కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి రావాల‌నుకున్న ప్ర‌జ‌లు కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. కరోనా పరీక్షలు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.రాష్ట్రానికి వ‌స్తున్న‌ ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని గోవాలో గ‌ల‌ వైద్య‌పరీక్షా సదుపాయాలపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త ప్రణాళికను అమలు చేయడానికి ప్రభుత్వం ఎస్ఓపీలో మార్పు తీసుకువచ్చింది. ఈ విష‌యాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.

గోవా రాష్ట్రంలోకి ప్రవేశించే వారికి ఎంట్రీ పాయింట్ల వద్ద కోవిడ్-19 పరీక్షలు చేస్తామని ప్రభుత్వం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర సరిహద్దులు మూసేయాలని రాజస్థాన్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాజస్థాన్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం మొదల‌య్యింది దీంతో సరిహద్దులూ మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్ రావాలన్నా అనుమ‌తి తప్పనిసరి అని అధికారులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం రాజస్థాన్‌లో ఇప్పటికి 2,600 కరోనా కేసులున్నాయి. కాగా మహారాష్ట్రలో కరోనా సామాజిక వ్యాప్తి జరిగిదంటూ వస్తున్న వార్తలపై ఆరోగ్య మంత్రి రాజేశ్‌తోపే స్పందించారు. ‘‘సామాజిక వ్యాప్తి ఉందని నేను భావించడం లేదు. అదో ప్రచారం, ఊహ మాత్రమే.’ అని తేల్చి చెప్పేశారు.

మ‌హారాష్ట్ర‌లో సామాజిక‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది . కనీసంలో కనీసం 20 నుంచి 40 శాతం కరోనా కేసులు ఎక్కడి నుంచి వ్యాప్తి చెందాయో తెలియకపోతే మూడో దశలోకి వెళ్లినట్లు లెక్క‌. మూడో దశకు చేరామాలేదా అన్నది కేంద్రమే చెప్పాలి. అదంతా సాంకేతికం పదజాలం’’ అని ఆయన పేర్కొన్నారు. కేసులను గుర్తించడంలో తాము మూడు రకాల ‘టీ’ ల ద్వారా ప్రయత్నిస్తున్నామని అందులో మొదటిది దూకుడుగా గుర్తించడం, టెస్టులు చేయడం, ఐసోలేషన్‌కు పంపడమ‌న్నారు. మూడోది చికిత్స అని వివరించారు. వీటి ఆధారంగానే తాము రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కేసును గుర్తించడానికే తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఐసీయూ పడకలతో కలుపుకొని తాము 80 శాతం పడకలను ప్రైవేట్ ఆస్పత్రుల నుంచే తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 45,000 పైగానే బాధితులు కోలుకొని, డిశ్చార్జ్ అయ్యారని, మరణాల రేటు 3.5 శాతంగా ఉందని మంత్రి రాజేశ్ తోపే వివ‌రించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles