29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

దేశంలో అత్య‌ల్ప సంఖ్య‌లోనే కోవిడ్‌-19 బాధితులు !

దేశంలోని 83 జిల్లాల్లోని జనాభాలో 0.73 శాతం మంది మాత్రమే కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ -19 రోగుల మరణాల రేటు కూడా భార‌త్‌లో అత్యల్పంగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ సిరో సర్వే ఫలితాలను తెలియజేస్తూ దేశంలో అత్యల్ప సంఖ్యలోనే కోవిడ్ -19 బాధితులు ఉన్నారని తెలిపారు.లాక్డౌన్ అయిన ఐదున్నర వారాల తరువాత ఏప్రిల్ 30 వరకు ఇదే స్థాయిలో కొన‌సాగుతున్న‌ద‌న్నారు.

అయినప్పటికీ దేశ‌జనాభా ఇంకా ముప్పులోనే ఉందని, క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌దని అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో 1.09, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధిక‌ ప్రమాదం ఉందని ఆయన అన్నారు. నగరాల్లో మురికివాడలు సంక్రమణకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాల్సి ఉంటుంద‌ని, కంటైన్‌మెంట్ జోన్‌లో ఇన్‌ఫెక్షన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సర్వే కోసం దేశంలోని 83 జిల్లాల్లోని 28,595 ఇళ్లను సందర్శించి 26,400 మంది రక్త నమూనాలను తీసుకున్నామని చెప్పారు. ఈ జిల్లాల్లో 0.73శాతం మందికి మాత్రమే వైర‌స్ సోకిన‌ట్లు ఆధారాలున్నాయని సర్వేలో తేలింద‌న్నారు. దీని అర్థం లాక్‌డౌన్‌ సానుకూల ప్రభావాన్ని చూపింద‌ని, వైరస్ సంక్రమణ వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించింద‌ని ఆయన చెప్పారు. త్వ‌ర‌లో భారీ స్థాయిలో జనాభా వైరస్ సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles