29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

క‌రోనాతో బాగుప‌డ్డ మ్యాగీ, బ్రిటానియా !

గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ ప‌లు వ్యాపారాల‌ను దెబ్బ‌తీసింది. అయితే కొన్నిసంస్థ‌ల‌కు ఇది స‌ద‌వ‌కాశంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో మ్యాగీ నూడుల్స్‌తో పాటు బ్రిటానియా పార్లేజీ బిస్క‌ట్ల విక్ర‌యాలు అమాంతం పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందు కాలంతో పోల్చితే మ్యాగీ విక్ర‌యాలు లాక్‌డౌన్ అమ‌లవు తున్న‌ప్పుడు, కాస్త స‌డ‌లింపుల త‌రువాత 25 శాతం మేర‌కు పెరిగాయి. లాక్‌డౌన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేసిన కారణంగా చాలా మందికి తక్షణ అల్పాహారంగా మ్యాగీని ఎంపిక చేసుకున్నారు. లాక్‌డౌన్ ప్రారంభించ‌క ముందు, ఈ వార్త తెలియ‌గానే చాలామంది మ్యాగీ ప్యాకెట్ల‌ను కొనుగోలు చేసి నిల్వ‌చేసుకున్నారు. అలాగే లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌లో కూడా భారీ ఎత్తున మ్యాగీ ప్యాకెట్ల‌ను కొనుగోలు చేశారు.

మ్యాగీ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ మాట్లాడుతూ లాక్‌డౌన్ స‌డ‌లించిన వెంట‌నే కంపెనీకి చెందిన‌ ఐదు కర్మాగారాల్లో మ్యాగీని చాలా వేగంగా ఉత్పత్తి చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌స్తుతం 12,000 కోట్ల రూపాయల టర్నోవర్‌తో నెస్లే ఇండియా దూసుకుపోతోంది. లాక్‌డౌన్‌ ముందు వరకు న‌ష్టాల్లో కొన‌సాగిన‌ పార్లే – జీ బిస్కెట్ల తయారీ కంపెనీ ఇప్పుడు అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో ఎక్కువ మంది పార్లే – జీ బిస్కెట్లను కొనుగోలు చేశారు. గ‌డ‌చిన 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు జరిగాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్కెట్‌ షేర్‌‌ 5 శాతానికి పెరిగిన‌ట్లు విసర్తించినట్లు చెప్పాయి. ప్రభుత్వ, స్వచ్చంధ సంస్థలు బిస్కెట్లు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు చేప‌ట్ట‌డంతో బిస్కెట్ ప్యాకెట్ల అమ్మకాలు పెరిగాయని అన్నారు. రెండు రూపాయ‌ల‌కే పార్లే గ్లూకోజ్‌ బిస్కెట్లు వస్తున్నందున వీటిని అధికంగా కొనుగోలు చేశార‌ని పార్లే ప్రాడెక్ట్స్‌ సీనియర్‌‌ కేటగిరి హెడ్‌ మయాంక్‌ షా చెప్పారు. అంతే కాకుండా ఈ బిస్కెట్లు నిల్వ చేసుకునేందుకు వీలు ఉండటం వల్ల కూడా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నార‌ని అన్నారు. గతంలో సునామీ, భూకంపాలు వచ్చిన సమయంలో కూడా పార్లే-జీ విక్రయాలు అమాంతం పెరిగాయ‌న్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles