29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

దేశంలో 3 ల‌క్ష‌ల‌కు చేరువైన క‌రోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 10 వేల‌కు పైగా కొత్త‌గా క‌రోనా కేసులు నమోద‌య్యాయి. దీంతో ప్ర‌స్తుతం 2 లక్షల 97,535 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాలు 8,498గా నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు లక్షా 41,842 గా నమోదయ్యాయి. లక్షా 47,194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 10,956 కేసులు, 396 కరోనా మరణాలు సంభవించాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కొత్త‌గా 10,956 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 4,320 కరోనా కేసులు నమోదుకాగా 165 మంది మరణించారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,607 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. 3,590 మంది మృతిచెందారు. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,877 కొత్త కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతిచెందారు. ఢిల్లీలో మొత్తం 34,687 కేసులు నమోదు కాగా, 1,085 మంది చనిపోయారు. 12,731 మంది కోలుకున్నారు. తమిళనాడులోనూ ఒకే రోజు 1,875 కొత్త కేసులు నమోదయ్యాయి. 38,716 మంది కరోనా బారిన పడ్డారు. 349 మంది మృతిచెందారు.

ప్రపంచవ్యాప్తంగా రోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో ఇండియా టాప్ ఫైవ్‌లో ఉంది. కొత్త కేసుల విషయంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, అమెరికా రెండు, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. ఒక్కరోజు నమోదవుతున్న మ‌ర‌ణాల‌ విషయంలోనూ భార‌త్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో బ్రెజిల్, అమెరికా, మెక్సికో ముందున్నాయి. మొత్తం మరణాల్లో మన దేశం 11వ స్థానంలో ఉంది. మొన్నటి దాకా 12వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం ముందుకు వ‌చ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 75 లక్షలు దాటాయి. 75 లక్షల 36 వేల 412 మంది కరోనా బారిన పడ్డారు. 4 లక్షల 21 వేల 236 మంది మృతిచెందారు. 38 లక్షల 19 వేల 858 మంది కోలుకోగా, 15 రోజులుగా లక్షకుపైగానే కేసులు నమోదవుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles