29.4 C
Amaravathi
Wednesday, January 19, 2022
spot_img

శ‌వాల మ‌ధ్య జ‌నాన్ని ఉంచుతారా..? ప్ర‌భుత్వాల‌కు సుప్రీం మంద‌లింపు !

కరోనా బాధితులు మృతి చెందిన‌ తరువాత వారి కుటుంబాలకు క‌నీస సమాచారం కూడా ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయిన‌వారు మృతి చెందినా కూడా కుటుంబ సభ్యులు వారి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్న‌ సందర్భాలు చాలా ఉన్నాయ‌ని పేర్కొంది. ఢిల్లీ ఆసుపత్రులలో దుర్భ‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, హోం మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన మార్గదర్శకాలు పాటించడం లేద‌ని, మృతదేహాల విష‌యంలో ఆసుప‌త్రులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

దీనిపై సమాధానం చెప్పాల‌ని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆసుపత్రులలో రోగులకు చికిత్స చేస్తున్న తీరును, మృతదేహాల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తుతీరును సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఢిల్లీ పరిస్థితి భయానకంగా ఉందని పేర్కొంది. మృతదేహాల చుట్టుప‌క్క‌ల ఉన్న ప‌రిస్థితుల్లోనే జ‌నం చికిత్స పొందుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో 2000 పడకలు ఖాళీగా ఉన్నాయని, అయితే రోగులను వైద్యుల స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొంది. రోగులు రోదిస్తున్న‌ వీడియోలను కోర్టు ప్రస్తావించింది. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని కోర్టు తెలిపింది. కరోనా పరీక్షల‌ను ఢిల్లీ ప్రభుత్వం తగ్గిస్తుండటంపై కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లోని వైద్య ప‌రీక్ష‌లు, స్థితిగ‌తుల గురించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల‌ను కోరింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles