26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

జూలై 15 నాటికి భారత్‌లో 8 లక్షల కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. 9915 మంది కరోనాతో మృతిచెందారు. లక్షా 80వేల 320 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 51 శాతంగా ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా విడుదలయిన ఓ సర్వేలో భారతీయులను మరింత భయాందోళనలకు గురిచేసే వివ‌రాలున్నాయి. నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరకుంటుందని ఆ పరిశోధనలో వెల్ల‌డ‌య్యింది. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 30న నమోదయింది. అప్పటి నుంచి జూన్ 15 వరకు.. 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి.

138 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరుకుంది. జూలై 15 లోగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 8లక్షలకు చేరుకుంటుందని మిచిగాన్ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో వెల్ల‌డించింది. జూలై 15 నాటికి ప్రపంచంలోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో.. భారత్ మూడో స్థానంలో ఉంటుందని మిచిగాన్ యూనివర్శిటీ బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ తెలిపారు. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ ఉంటుందని తెలిపారు. రాబోయే కొద్ది నెలల పాటు కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles