27.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

ఉబ్బసాన్ని త‌రిమికొట్టే ఆరు ఆహారాల గురించి తెలుసా..?

ఉబ్బసంతో బాధ‌ప‌డుతున్న‌వారికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. ఉబ్బసం నివారణకు చాలా కాలం ప‌డుతుంది. ఉబ్బసం బాధితులు ఆరోగ్యకరమైన ప‌దార్థాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి. వీటిని డైట్‌లో చేర్చడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆహారాలు ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి, కాలుష్యానికి గురికాకుండా ఉండటానికి దోహ‌ద‌ప‌డ‌తాయి. ఉబ్బసం అనేది శ్వాసకోశ వ్యాధి. ఉబ్బసం నివార‌ణ‌లో హోం రెమెడీస్ ఎంతో ప్రభావవంతంగా ప‌నిచేస్తాయి. ఉబ్బసం బాధితులు ఆహారం విష‌యంలో అజాగ్రత్తగా ఉంటే వ్యాధి తీవ్రతరం కావచ్చు. అందుకే ఉబ్బ‌సం బాధితులు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు
యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సిలో పుష్కలంగా లభిస్తుంది, ఇది ఊపిరితిత్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఆస్తమా దాడి ప్రమాదం తగ్గుతుంది. ఉబ్బసం బాధితులు ముఖ్యంగా నారింజ, బ్రోకలీ, కివి, పుచ్చకాయను ఆహారంలో చేర్చాలి. ఉబ్బసం లక్షణాలను తగ్గించాలనుకుంటే ప్రతిరోజూ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

తేనె మరియు దాల్చినచెక్క
తేనె మరియు దాల్చినచెక్క తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యస‌మస్యలు తొలగిపోతాయి. వీటిని తీసుకోవ‌డం ఉబ్బసం రోగులకు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు దాల్చినచెక్క పొడిలో ఒక చెమ్చా తేనె క‌లిపి తీసుకోవ‌డం ద్వారా ఉబ్బసం నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనెను ద‌గ్గు నివార‌ణ‌కు ఉపయోగిస్తారు. దీనిని దాల్చినచెక్కతో కలిపి తీసుకోవ‌డం వ‌ల‌న ఉబ్బసం బాధితులు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోగ‌లుగుతారు.

ప్రయోజనకారిగా తుల‌సి
తులసి తీసుకోవడం ద్వారా చాలా వ్యాధులు సహజంగా నయం అవుతాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. తులసిని ఆహారంలో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఉబ్బసం రోగులు టీలో రెండు మూడు తులసి ఆకుల‌ను వేసుకుని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో తులసి ఎంతో సహాయపడుతుంది.

ప‌ప్పుధాన్యాలు
పప్పుధాన్యాలు పుష్కలంగా ప్రోటీన్‌ను కలిగి ఉంటాయ‌ని మ‌న‌కు తెలిసిందే. పెస‌ర‌ప‌ప్పు, సోయాబీన్ త‌దిత‌ర‌ పప్పుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. అందుకే ఉబ్బసం రోగులు తప్పనిసరిగా ప‌ప్పు ధాన్యాలను తీసుకోవాలి. పప్పుధాన్యాలు తినడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

కాఫీ లేదా బ్లాక్ టీ
ఉబ్బసం రోగులు ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను సులభంగా అందించగల ఆహారాల‌ను తీసుకోవాలి. ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను అందించడానికి కాఫీ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కెఫిన్‌లో ఉండే బ్రోంకోలిటర్ ఊపిరితిత్తులలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. అలాగే బ్లాక్ టీ కూడా ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు చాలా వ్యాధుల‌ను హ‌రింప‌జేస్తాయి‌. ఆకుపచ్చని కూరగాయలు ఉబ్బస నివార‌ణ‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఊపిరితిత్తులలో కఫం చేర‌దు. ఆకుపచ్చని కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రేగులు మరియు ఊ పిరితిత్తులు స‌క్ర‌మంగా పనిచేస్తాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles