25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

Big Breaking: మేడ్ ఇన్ ఇండియా కరోనా టాబ్లెట్ సిద్ధం..

తాజాగా ఒక శుభవార్త వింటున్నాము… ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి ప్రపంచంలోనే మొదటి సారిగా ఇండియా మేడ్ టాబ్లెట్ విడుదలకి రంగం సిద్ధం అయ్యింది… ఇండియా కి చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ (Glenmark ) ఈ రోజు Favipiravir డ్రగ్ ని టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి తెస్తుంది… దానిని ఫాబి ఫ్లూ ( Fabi Flu ) అనే బ్రాండ్ పేరుతో విడుదల చేస్తుంది…

ఈ టాబ్లెట్ కి ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కూడా లభించింది… ఈ టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది ….అయితే ఈ టాబ్లెట్ కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నారు… మొదటి రోజున 2 సార్లు 1800 mg డోస్ తీసుకోవాలి అని రెండవ రోజు నుంచి 14వ రోజు వరకు 2 సార్లుగా 800 mg డోస్ తీసుకోవాలి అని సూచిస్తున్నారు.

ఈ టాబ్లెట్ ఇప్పటికే మూడు సార్లు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది… 20 సంవత్సరాల వయసు వారి నుంచి 90 సంవత్సారాల వరకు ఉన్న పేషెంట్స్ పై ప్రయోగాలు పూర్తి చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మరి ఈ టాబ్లెట్ మనకి అందుబాటులో ఉండే మందుల షాపుల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది… ఏది ఏమయినప్పటికీ కరోనా భయంతో అల్లాడి పోతున్న ప్రజలకి ఇది శుభవార్త అనే చెప్పాలి..

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles