36.6 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

వ‌ర్షాకాలంలో ఆహారం తినే ప‌ద్ధ‌తి ఇదే !

సాధారణంగా వర్షాకాలం జూలై నుంచి మొదలవుతుంది. అయితే ఈసారి వాతావ‌ర‌ణం ఏమాత్రం అనుకూలంగాలేన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌వైపు ప్రపంచం కరోనాతో అల్లాడిపోతుండ‌గా, మ‌రోవైపు తరచూ వ‌స్తున్న భూకంపాలు, తుఫానులు మ‌న‌ల్ని మ‌రింత భ‌యానికి గురిచేస్తున్నాయి. ఏదిఏమైన‌ప్ప‌టికీ వర్షాకాలంలో ఆరోగ్యం విష‌యంలో ప్ర‌తీఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఉత్త‌మం. అప్పుడే మనం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌గ‌లుగుతాం. వర్షాకాలంలో ఏ కూరగాయలనైనా ప‌చ్చిగా తిన‌కూడ‌దు. ఇందులో ఆకులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూర‌ల‌ను వేడి నీటిలో కడిగి ఆ త‌రువాతే వినియోగించాలి.

సాధారణంగా పండ్లు, కూరగాయలతో చేసే సలాడ్ తినడానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. కానీ వర్షాకాలంలో ఈ అభిరుచిని కొద్దిగా మార్చాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో కూడా సలాడ్ తీసుకోవాలి. దీనివ‌ల‌న‌ శరీరానికి త‌గిన మోతాదులో ఫైబర్ అందుతుంది. అయితే వర్షాకాలంలో స‌లాడ్ చేసే స్ట‌యిల్ మార్చాలి. మీరు తినాలనుకుంటున్న సలాడ్‌కు సంబంధించిన కూరగాయలను ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఆ త‌రువాతే వాటితో మీకు నచ్చిన విధంగా సలాడ్ సిద్ధం చేసుకోవాలి. సలాడ్ తయారు చేయడానికి ముందుగా కూరగాయలను ఉడకబెట్టడం వ‌ల‌న‌… వర్షం కారణంగా కూరగాయలలో పెరిగే ఫంగస్ మరియు బ్యాక్టీరియా నుండి ర‌క్ష‌ణ దొరుకుతుంది. అలాగే గొంగళి పురుగులు, మరియు వాటి గుడ్లు తొల‌గిపోతాయి. వర్షాకాలంలో గొంగళి పురుగులు పండ్లు, కూరగాయల లోపల గుడ్లు పెడ‌తాయి. వీట‌ని నేరుగా తీసుకుంటే వ్యాధులు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

మ‌రోవైపు పండ్లు, కూరగాయల పంటలను తెగుళ్ళ నుండి కాపాడటానికి రైతులు వర్షాకాలంలో పాశ్చరైట్‌లను పిచికారీ చేస్తారు. ఈ కారణంగా కూరగాయలలో విష పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా పేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో వాటిని పచ్చిగా తింటే అప్పుడు కడుపు నొప్పి లాంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. వర్షాకాలంలో ఇత‌ర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. వీటి నుంచి అప్రమత్తంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. మ‌రోవైపు ఇంట్లో నిల్వ చేసిన డ్రైఫ్రూట్‌ల‌లో తేమ కారణంగా ఫంగస్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. వీటికి ప్ర‌త్యామ్నాయంగా మొలకలను తినేందుకు సిద్ధం చేసుకోవాలి. ఇటువంటి జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోగ‌లుగుతాం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles