25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

క‌రోనా వైర‌స్‌కు మ‌రో ఔష‌ధం సిద్దం..

క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు మ‌రో ఔషధం సిద్ధ‌మ‌య్యింది. దీనికి భారతదేశంలో అనుమ‌తి ల‌భించింది. కోవిడ్-19 చికిత్స కోసం ఇన్వెస్టిగేషనల్ యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను సిద్ధం చేసిన‌ట్లు ప్ర‌ముఖ డ్ర‌గ్‌ కంపెనీ హెటెరో తెలిపింది. ఈ ఔష‌ధం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) నుంచి అనుమతి పొందింద‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఈ ఔషధాన్ని కోవిఫోర్ పేరుతో భారతదేశంలో విక్రయించనున్నారు. కరోనా చికిత్స కోసం ఫేవిపిరవిర్ పేరిట ఒక ఔష‌ధానికి గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ నిన్న‌నే అనుమ‌తి పొందింది.

ఫాబిఫ్లూ పేరుతో ఈ ఔషధాన్ని గ్లాన్‌మార్క్ విడుదల చేసింది. కోవిడ్ -19 అనుమానిత లేదా ధృవీకరించబడిన రోగుల చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి డిజిసిఐ ఆమోదించినట్లు కంపెనీ తెలిపింది. తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న రోగులకు ఈ ఔషధం ఇవ్వవచ్చు. క్లినికల్ ఫలితాలు సానుకూలంగా ఉన్నందున భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కోవిఫోర్ ఆమోదం గేమ్ ఛేంజర్ అని నిరూపిత‌మ‌య్యింద‌ని కంపెనీ తెలిపింది.

ఈ ఔషధాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు త‌క్ష‌ణం అందించడానికి సిద్ధంగా ఉందని హెటెరో పేర్కొంది. కోవిఫోర్ ఔషధం 100 ఎంజి(ఇంజెక్షన్)రూపంలో లభిస్తుంది. ఇది ఇంట్రావీనస్‌గా డాక్టర్ లేదా హెల్త్ కేర్ వర్కర్ పర్యవేక్షణలో మాత్ర‌మే ఇవ్వాలి. కోవిడ్ -19 చికిత్స పరిధిని విస్తరించడానికి ఈ కంపెనీ యుఎస్‌కు చెందిన గిలియడ్ సైన్సెస్ ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి అవసరమయ్యే స్టాక్‌ను ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉందని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles