35 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

ప‌డుకునే ముందు పురుషులు అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులు..

ప్ర‌స్తుత కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అసమానత అనేది లేదు. అన్నిరంగాల్లో పురుషులతో స‌మానంగా స్త్రీలు కూడా ప‌నిచేస్తున్నారు. అయితే స్త్రీల‌తో పోల్చిచూస్తే పురుషులు త‌మ‌ ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి అజాగ్రత్తతో ఉంటారు. ఆహార‌విహారాదుల‌లో సరైన శ్రద్ధ చూపకపోవడంతోపాటు కొన్ని దుర‌ల‌వాట్ల కార‌ణంగా వారు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ఇవి తీవ్రంగా ప‌రిణ‌మిస్తాయి. అయితే జీవ‌న‌శైలిలో కొన్ని మార్పులు చేసుకోవ‌డం ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు.

అర్థరాత్రి ఆహారాన్ని ముట్టొద్దు
కొంతమంది పురుషులు ఆఫీసు, ఇంటి పనులను ముగించిన తరువాత అర్ద‌రాత్రి భోజనానికి కూర్చోవడం అలవాటుగా మార్చుకుంటారు. అలాగే బ్యాచిలర్స్ కూడా రాత్రి 12 నుండి ఒంటి గంట వరకు ఆహారం తినడం అలవాటు చేసుకుంటారు. ఇది జీర్ణక్రియను పూర్తిగా పాడు చేస్తుంది. ఫ‌లితంగా క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది ప‌డ‌తారు. అందుకే అర్థరాత్రి తినడం అనే అలవాటును వ‌దులుకునేందుకు ప్రయత్నించండి.

అర్థరాత్రి వ‌ర‌కూ మేల్కొని ఉంటే…
కొంతమందికి రాత్రి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటమంటే చాలా ఇష్టం. రోజువారీ దిన‌చ‌ర్య ముగిశాక రాత్రి నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీల‌కు అతుక్కుపోతారు. ఇది దినచర్యలో భాగంగా మారిపోతుంది. ఫ‌లితంగా నిద్రలేమికి గురవుతారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, అర్థరాత్రి వరకు మేల్కొనే మనిషి సామర్థ్యం చాలా బలహీన ప‌డుతుంది. అందుకే ఎవ‌రైనా స‌రే అర్థరాత్రి వ‌ర‌కూ మేల్కొని ఉండే అలవాటు ఉంటే ఈ రోజు నుండే దానిని వ‌దిలేయాలి.

మద్యపానం మంచిదికాదు
మద్యం సేవించడం వల‌న‌ క్యాన్సర్ మరియు మూత్రపిండాల వైఫల్యం లాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాల‌ ప్రకారం, మద్యపానం లైంగిక హార్మోన్లను దెబ్బ‌తీస్తుంది. దీనికితోడు నిరంతర మద్యపాన అల‌వాటు మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా నిలుస్తుంది.

చెడు అల‌వాట్ల నుంచి బయటపడండి
చెడు అలవాట్లు అంటే పోర్న్ చూడ‌టం అల‌వాటు చేసుకోవ‌డం లాంటివి. ఇటువంటి అల‌వాట్ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఈ వ్యసనం జననేంద్రియాలకు నష్టం క‌లిగించ‌డంతో పాటు అనేక రకాల లైంగిక రుగ్మతలకు కారణంగా నిలుస్తుంది. జననేంద్రియాలు బలహీన ప‌డిన‌పుడు, అనేక రకాల లైంగిక సమస్యలు ఎదుర‌వుతాయి. ఇది వైవాహిక జీవితంలో లైంగిక ఆనందంపై ప్రభావాన్ని చూపుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles