35 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

ఈ ఊర‌గాయ‌లు.. రుచికి రుచి, ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ !

కరోనాను నివార‌ణపై అవ‌గాహ‌న పెంపొందించుకున్న‌వారంతా ఇప్పుడు త‌మ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఆయుర్వేదం తెలిపిన వివ‌రాల ప్రకారం మన ఇంటిలోనే ఉండే ఆహార ప‌దార్థాలు, సుగంధ ద్రవ్యాలలో రోగనిరోధక శక్తిని పెంచే ల‌క్ష‌ణాలున్నాయి. భోజ‌నంలో ఊరగాయ తినడం భారతీయ సంప్రదాయంలో ఒకటి. మనం ఊరగాయలను తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

ఉసిరి ఊర‌గాయ‌:
కురుల‌కు మరియు కళ్ల‌కు ఎంతో మేలుచేసే ఉసిరికాయ మ‌న రోగనిరోధక శక్తిని పెంచ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయం చేయడంతో పాటు, రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. దీనితో పాటు సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి కూడా రక్షించడానికి ఇది సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది రోగనిరోధక శక్తిని మ‌రింత‌గా పెంచుతుంది.

ఎలా తయారు చేయాలి?
కొన్ని ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని, వాటిని ముందుగా చల్లటి నీటిలో కడగండి. వాటిని శుభ్రంగా తుడ‌చుకున్నాక ఫోర్క్ సహాయంతో వాటికి గాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ‌లు వేసి త‌గిన విధంగా వేయించుకుని, తరువాత దానిలో కాస్త పసుపు వేసుకోండి. ఇప్పుడు దానిలో అంత‌కుముందు సిద్ధంగా ఉంచుకున్న ఉసిరికాయ‌ల‌ను వేయండి. దీనిని మీడియం మంట‌మీద ఐదు నిమిషాలు మ‌గ్గించుకోండి. త‌రువాత దీనిలో రెండు టీస్పూన్ల ఉప్పు, త‌గినంత కారం వేసి క‌లియ‌బెట్టాలి. దీనిని చ‌ల్ల‌బ‌ర‌చిన అనంత‌రం ఒక జాడీలో నింపుకోండి. ఈ ఊర‌గాయ రోగనిరోధకశ‌క్తి పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

నిమ్మ, అల్లం ఊరగాయ
నిమ్మ మరియు అల్లం రెండింటిలోనూ లెక్క‌లేనన్ని పోషకాలు ఉన్నాయి ఇవి మ‌న‌ల్ని ఫ్లూ నుండి రక్షించడంతో పాటు రోగనిరోధక శక్తితో పోరాడే సామర్థ్యాన్ని పెంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ రెండూ జీవక్రియ స‌క్ర‌మంగా జ‌రిగేందుకు దోహ‌ద‌ప‌డ‌టంతోపాటు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటికి పసుపు జోడించ‌డం ద్వారా ఆరోగ్యానికి స‌హ‌కారిగా మారుతుంది.

ఎలా తయారు చేయాలి?
ముందుగా పచ్చిమిర్చి, నిమ్మకాయ‌, అల్లం మొద‌లైన‌వాటిని శుభ్రంగా క‌డుక్కోవాలి. ఒకపెద్ద గిన్నెలో అల్లం ముక్క‌లు, నిమ్మరసం, త‌గినంత ఉప్పు, జీల‌క‌ర్ర‌, పసుపు , కారం, త‌రిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రమైన పాత్ర‌లో వేసుకుని ఒక‌రోజు ఎండలో ఉంచాలి. త‌రువాత దానిని ఒక జాడీలోకి తీసుకోవాలి. ఈ ఊర‌గాయ‌ను ప్రతిరోజూ భోజనంలో తీసుకోవ‌డం వ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌లోపేత‌మ‌వుతుంది. వైర‌స్‌, బ్యాక్టీరియాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే సామ‌ర్థ్యం పెంపొందుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles