36.6 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

కోపం తారాస్థాయికి చేరిందా..? ఇలా ఆపేయండి !

ఏదైనా విషయంపై మనకు తీవ్ర‌మైన కోపం వచ్చినప్పుడు, మన మనసులోని అన్నిభావాల‌ను ఎదుటి వ్యక్తిపై వెళ్ల‌గ‌క్కేస్తుంటాం. దీనివల్ల మన మానసిక స్థితి మ‌రింత దిగజారుతుంది. కోపం మన అదుపులో ఉన్నప్పుడు, ఇలా ప్ర‌వర్తించం. అదుపులో లేని కోపం మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. బీపీని పెంచే ఇటువంటి పరిస్థితిని నివారించడానికి మ‌నం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం అనేది అంద‌రికీ వస్తుంది. కొంత‌మందికి త్వరగా వస్తే, మరి కొంద‌రు చిన్నచిన్న‌ విషయాలను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న కోపం వెంట‌నే రాదు. అయితే ఒక్కోసారి ఎంత సహనంతో ఉన్నా, కోపాన్ని నియంత్రించడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎప్పుడో ఒక‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే ఎదుర‌వుతుంది.

అటువంటి పరిస్థితిలో మన మానసిక స్థితి బ‌ల‌హీన‌ప‌డుతుంది. కోపాన్ని వ్య‌క్తం చేయ‌కుండా ఉండ‌లేం. ఫ‌లితంగా కోపాన్ని వెళ్ల‌గ‌క్కి మ‌నం బ‌ల‌హీనమ‌వ‌డ‌మే కాకుండా, ఇత‌రుల ముందు చుల‌క‌న అవ‌డంతోపాటు మాన‌సిక రోగాల‌ను కొనితెచ్చుకున్న‌వారం అవుతాం. అందుకే కోపం వ‌చ్చినపుడు మ‌న‌సును తేలిక‌పర‌చం ఎంతో అవ‌స‌రం. కోపాన్ని అదుపు చేసుకునేందుకు ప‌లు మార్గాలున్నాయి. ఎవ‌రిమీద‌నైనా కోపం వ‌చ్చిన‌పుడు ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలోకి చూస్తూ, ఆ వ్యక్తికి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఒక్క విష‌యం కూడా వ‌ద‌లకుండా చెప్పండి. ఈ విధంగా ఆ వ్య‌క్తిపై మీకున్న కోపాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. విప‌రీతంగా కోపం తెచ్చుకుని, మ‌న‌సులోనిదంతా బ‌య‌ట పెట్టేశాక ఒక గ్లాసుడు చల్లటి నీరు తాగి, ప్ర‌శాంత భావ‌న‌తో కొంతసేపు పడుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. మనస్సును బంధించడానికి ప్రయత్నించకండి. ఈ విధంగా ప‌డుకొని త‌రువాత మేల్కొన్నాక ఎంతో తేలిక‌గా అనిపిస్తుంది.

చాలా కోపంగా ఉన్నప్పుడు మరియు పరిస్థితులు అస్స‌లు అదుపులో లేన‌పుడు మనసును తేలికపరచడానికి, కొంతసేపు కేకలు వేయాలి. లేదా ఏడ్చేయాలి. అవును… ఇలా చేయ‌డం వింత‌గా అనిపించినా, త‌ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, గుండెలోని భారం తీరిపోయిన‌ట్ల‌నిపిస్తుంది. మ‌రోవైపు ఏడుపు వ‌ల‌న కొన్ని ప్ర‌యోజ‌నాలున్నాయి. మ‌నం పెద్దగా నవ్వినప్పుడు, లేదా ఏడ్చిన‌పుడు మనలోని ప్రతికూలశక్తి బ‌య‌ట‌కుపోతుంది. మెదడుకు ప్ర‌శాంత‌త‌తో కూడిన అనుభూతి క‌లుగుతుంది. ఇలా కోపం నుంచి బ‌య‌ట‌ప‌డి కొంత‌సేపు క‌ళ్లుమూసుకుని, దీర్ఘ‌ శ్వాస తీసుకుని, కాసేపు ఒంటరిగా కొంత సమయం గడిపినట్లయితే, మ‌న‌కిమ‌నం రీఛార్జ్ చేసుకున్న‌వారం అవుతాం. ఈ విధంగా చేయ‌డంవ‌ల‌న, మ‌న‌సు తేలిక‌ప‌డి తిరిగి ఇత‌ర ప‌నుల‌ను మ‌రింత ఉత్సాహంగా చేయ‌గ‌లుగుతాం. ఎప్ప‌టిక‌ప్పుడు కోపం నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం మ‌న మాన‌సిన‌, శారీర‌క ఆరోగ్యానికే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles