30.7 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

క‌రోనాకి పతంజలి ఔష‌ధం ‘క‌రోనిల్’ విడుద‌ల‌ !

ప్ర‌ఖ్యాత యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ‌ కరోనావైరస్ నివార‌ణ‌కు క‌రోనిల్ పేరుతో ఒక ఔషధాన్ని విడుదల చేసింది. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌పంచంమొత్తం టీకా, ఔష‌ధాల కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో తాము మొదటి ఆయుర్వేద ఔషధాన్ని అభివృద్ధి చేసినందుకు గ‌ర్వ‌స్తున్నామ‌ని ఔష‌ధం విడుద‌ల సంద‌ర్భంగా బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ ఔష‌ధం తీసుకున్న‌69 శాతం మందికి వ్యాధి మూడు రోజుల్లో న‌య‌మ‌వుతుంద‌ని తెలిపారు.

ఈ ఔష‌ధంపై ముందుగా అహ్మదాబాద్, ఢిల్లీతో పాటు అనేక ఇతర నగరాల్లో పరీక్షలను నిర్వహించామ‌న్నారు. ఈ ఔష‌ధం 100 శాతం స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింద‌న్నారు. ఈ ఔష‌ధంతో కరోనా వైరస్, దాని అనుబంధ సమస్యలను నియంత్రించగలిగామ‌ని తెలిపారు. హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ల‌ పరిశోధనల ఆధారంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ కరోనా కిట్ రూ. 545కు లభిస్తుందని పతంజలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆచార్య బాల‌కృష్ణ‌ తెలిపారు. ఈ డ్రగ్ కిట్ ఇంకా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేద‌ని, వారంరోజుల్లో పతంజలి దుకాణాల్లో లభిస్తుందని తెలిపారు. ఈ కరోనా కిట్‌ను పంపిణీ చేయడానికి ఒక యాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles