27.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

ఈ జ‌ప‌నీస్ డైట్‌తో ప్ర‌యోజ‌నాలు బోలెడు!

ఈ రోజుల్లో బరువు పెరగడ‌మ‌నేది సాధారణ సమస్యగా మారిపోయింది. ఊబకాయం అనేది శరీర ఆకృతిని మార్చివేయ‌డ‌మే కాకుండా, అనేక రకాల వ్యాధులకు కూడా దారితీస్తుంది. దీనిని గ్ర‌హించిన‌వారు డైటింగ్ మరియు వ్యాయామాల‌తో బరువు తగ్గడానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ విధానాలు స‌రైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. ఫ‌లితంగా బరువు అన‌కున్నంత‌గా త‌గ్గ‌రు. జ‌పాన్‌ వాసులు అనుస‌రిస్తున్న హరా హచి బూ డైట్ గురించి చాలా మందికి తెలియదు. బరువు తగ్గడానికి ఇది జపనీస్ వారు అనుస‌రిస్తున్న విధానం. జపాన్ ప్రజలు శతాబ్దాలుగా ఈ డైటింగ్‌ను అనుసరిస్తున్నారు. జపనీస్ ప్ర‌జ‌లు స్లిమ్‌గా క‌నిపించ‌డానికి ఇదే కార‌ణం. మీరు కూడా ఈ విధానం ద్వారా బరువును అదుపులో ఉంచాలనుకుంటే ఈ రోజు నుండే ఈ ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం మొద‌లుపెట్టండి.

హరా హచి బూ అంటే ఏమిటి?
హరా హచి బూ అనేది జపనీస్ వాక్యం. దీని అర్థం మీ కడుపును 80 శాతం మాత్రమే నింపండి. 80 శాతం నిండినంత వరకే తినాల‌ని చెప్పే కన్ఫ్యూషియస్ సిద్ధాంతం ఇది. ఒకినావా ప్రజలు హచి బూ డైట్‌ను అవలంబిస్తారు. 21వ శతాబ్దంలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ఒకినావా ద్వీపంలోని ప్రజలు ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉన్నారు. వారు వంద సంవత్సరాలు జీవిస్తున్నారు. దీనికి కారణం ఒకినావా ప్రజలు హరా హచి బూను అనుసరించడ‌మ‌నేన‌ని తెలుస్తోంది. రోజుకు 1,800 నుండి 1,900 కిలో కేలరీలు క‌లిగిన ఆహారాన్నే తీసుకుంటారు. ఒకినావాలోని ప్రజలు తమ కడుపును 80 శాతం ఆహారంతోనే నింపుతారు.

హరా హచి బూను ఎందుకు అనుసరించాలి?
పురాతన జపనీస్ క్యాటరింగ్ శైలి ప్రకారం ఎవ‌రైనా స‌రే ఎప్పుడూ 100 శాతం ఆహారం తీసుకోకూడ‌దు. కడుపు 80 శాతం నిండిన వెంట‌నే తిన‌డం ఆపేయాలి. హరా హచి బూ డైట్‌లో తెలిపిన వివ‌రాల‌ ప్రకారం మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ‌వ్య‌వ‌స్థకు చాలా సమయం పడుతుంది. ఇది సెల్యులార్ ఆక్సీకరణకు దారితీస్తుంది. ఫ‌లితంగా ఈ డైట్ తీసుకునే వ్యక్తి యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది. కడుపును 80 శాతం మాత్రమే నింపుతుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది ఆరోగ్య సమస్యలను కలిగించదు.

హచి బూ వల్ల కలిగే ప్రయోజనాలు
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నడుము మరియు ఉదరంపై కొవ్వును పేరుకోనివ్వ‌దు. ఇది ఊబకాయం, జీర్ణశయాంతర సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్ మరియు జీవక్రియ రుగ్మతలను నివారిస్తుంది. హరా హచి బూ బ్లడ్‌లో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది, తద్వారా హృదయ సంబంధిత‌ వ్యాధులు, క్యాన్సర్ మరియు వయస్సు సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది.

హరా హచి బూను ఎలా అనుసరించాలి

నెమ్మదిగా తినండి
వేగంగా తినే అలవాటు కారణంగా, వ్యక్తి ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. ఆహారాన్ని నెమ్మదిగా నమలితినాలి. ఇది త్వరగా కడుపు నింపుతుంది. మరియు ఎక్కువ తినడానికి అవ‌కాశం ఏర్ప‌డ‌దు.

ఆహారం మీద దృష్టి పెట్టండి
తినేటప్పుడు టీవీ, కంప్యూటర్ మరియు మొబైల్‌ను చూడ‌కండి. తినేటప్పుడు ఆహారం మీద మాత్రమే దృష్టి పెట్టండి. నెమ్మదిగా, తక్కువగా తినడం వ‌ల‌న ఆహారానికి గ‌ల రుచిని ఆస్వాదించ‌గ‌లుగుతారు.

చిన్న ప్లేటులోనే తినండి
భోజనం చేయడానికి ఎల్లప్పుడూ చిన్న ప్లేట్‌ను వాడండి. ఇది త‌క్కువ తిన‌డానికి ఉప‌క‌రిస్తుంది. హరా హచి బూ చెప్పే ఈ నియమాలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఊబకాయం నుండి బయటపడటానికి, ఎప్పుడు ఆహారం తీసుకున్నా క‌డుపు 80 శాతం మాత్రమే నిండేలాచూడండి. ఈ విధానం శరీరం మరియు మనస్సు రెండింటినీ ఆరోగ్యవంతంగా మారుస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles