25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

మృదువైన చ‌ర్మం కోసం నేరేడు ఫేస్‌ప్యాక్ వేసుకోండి !

వేసవి రాక‌తోనే చర్మానికి సంబంధించిన ప‌లు రకాల సమస్యలు చుట్టుముడ‌తాయి. జిడ్డు చ‌ర్మం క‌లిగిన‌వారికి మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు త‌లెత్తుతాయి. మ‌రోవైపు వేడిమి కార‌ణంగా కొంతమందికి చ‌ర్మం పొడి బారుతుంది. అయితే నేరేడు పండ్లు ఉపయోగించడం ద్వారా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు. నేరేడు పండ్లు రక్త శుద్దీకరణ ఏజెంట్లుగా పనిచేస్తాయి. మొటిమలు, మచ్చలు, చ‌ర్మం పొడిబార‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను త‌రిమికొడ‌తాయి.

నేరేడు పండ్ల వాడ‌కం ద్వారా శ‌రీరంలోని మలినాలను తొలగించుకోవ‌చ్చు. ఆరోగ్యకరమైన, మృదువైన, మెరిసే చర్మాన్ని పొంద‌వ‌చ్చు. దీన్ని మీ డైట్‌లో చేర్చుకోవడమే కాకుండా, ఫేస్ ప్యాక్ కూడా వినియోగించుకోవ‌చ్చు. ఇప్పుడు నేరేడుపండ్ల ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

నేరేడు, హనీ ఫేస్‌ప్యాక్‌
నేరేడు పండ్ల‌లో మంచి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వీటిలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఉప‌యుక్త‌మ‌వుతాయి. ఒక చెమ్చా తేనెను నేరేడుపండ్ల‌ గుజ్జులో కలపడం ద్వారా ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని ముఖంపై అప్ల‌యిచేసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్ర ప‌ర‌చ‌డ‌మే కాకుండా ఫెయిర్‌గా మారుస్తుంది.

బెర్రీస్, రోజ్‌వాటర్ ఫేస్‌మాస్క్‌
నేరేడులో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి మీ చర్మానికి సహజమైన ఆరోగ్యకరమైన గ్లోను ఇస్తాయి. ఇది జిడ్డుగల చర్మం గ‌ల‌వారికి చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతుంది. నేరుడుపండ్ల‌ గుజ్జును కొద్దిగా రోజ్ వాటర్ మరియు గోధుమ‌‌ పిండితో కలపడం ద్వారా మాస్క్ తయారు చేసుకుని ముఖం మీద రాసుకోండి. ఈ మాస్క్‌ క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మంపై జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.

నేరేడు, నిమ్మ‌ర‌సంతో
ఈ ఫేస్ మాస్క్ త‌యారుచే‌సేందుకు ఒక గిన్నెలో నేరేడుగుజ్జు తీసుకొని దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు ఒక‌ టీస్పూన్ రోజ్ వాటర్ క‌ల‌పండి. ఈ పేస్ట్‌ను ముఖం మీద రాసుకోండి. 20 నిమిషాలు అలానే ఉంచి, త‌రువాత క‌డిగేసుకోండి.

న‌ల్ల‌టి మ‌చ్చ‌ల‌ను తొల‌గించేందుకు
బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది మీ చర్మంపై ఏర్ప‌డే నల్లటి మచ్చలను తేలికపరచడానికి సహాయపడుతుంది. బెర్రీస్ సీడ్ పౌడర్, బాదం ఆయిల్ మరియు గోధుమ పిండిని క‌లుపుకోవ‌డం ఫేస్ మాస్క్ సిద్ధం చేసుకోవ‌చ్చు. దీన్ని ముఖానికి అప్ల‌య్‌ చేసి కాసేపు ఆరనివ్వాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ఈ ప్యాక్ వేసుకోవ‌డం ద్వారా మంచి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. త‌ద్వారా కళ్ళ కింద ఉండే నల్లని వ‌ల‌యాలు, మచ్చలు మాయ‌మ‌వుతాయి.

మొటిమల నివార‌ణ‌కు
ఈ ఫేస్‌ప్యాక్‌ చేయడానికి నేరేడు పండ్ల‌ను ఎండ‌బెట్టి, మెత్తటి పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆ పొడిని తీసుకుని దానిలో కొద్దిగా పాలు వేసుకుని, బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి రాయండి. కొంత సమయం తరువాత శుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వేసుకోవ‌డం ద్వారా కాంతివంత‌మైన చ‌ర్మాన్ని పొంద‌వ‌చ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles