26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

కరోనా విశ్వరూపం.. ఒక్క రోజులో 17 వేల కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి త‌న విశ్వరూపం ప్రదర్శిస్తోంది. టెస్టులు పెరుగుతున్న‌కొద్దీ పాజిటివ్ కేసులు అదేస్థాయిలో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 17 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 15 వేలు దాటింది. ఈరోజు ఉదయం వెల్లడైన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17,296 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

తాజా కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా 4,90,401 కొవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా మరో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి పెరిగింది. కాగా గత వారం రోజుల నుంచి వరసగా 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూరావ‌డం గమనార్హం. కేవలం ఈ నెల 1 నుంచి 26 వరకు దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత ఎంత‌లా ఉండో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,89,463 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల‌లో చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,85,636 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 58.24గా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూవ‌స్తోంది. వైరస్ బాధితుల సంఖ్య 97 లక్షలు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ప్రభావం చూపిస్తోంది. బ్రెజిల్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 97,11,805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,91,856 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 52,50,085 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌‌ల‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 25,04,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,26,780 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,52,293 మంది కోలుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles