26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

త‌డిసి ముద్ద‌య్యాక ఇలా చేయ‌క‌పోతే అనారోగ్యం ఖాయం..

రుతుపవనాలు దాదాపు భారతదేశమంతా విస్త‌రించాయి. ప‌లు చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో ఎవ‌రైనాస‌రే ఒక్కోసారి బ‌య‌ట‌కువచ్చిన‌పుడు, వారు వర్షంలో తడిసిపోవలసి వ‌స్తుంది. మ‌రోవైపు రుతుపవనాలు కూడా అనేక వ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి ఇటువంటి స‌మ‌యంలో ఆరోగ్యం విష‌యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షంలో తడిసిన వెంటనే అవలంబించాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన ఉపాయాల‌ను తెలియ‌జేస్తున్నాం. వీటిని పాటించ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌ముంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆసుపత్రికి వెళ్లడానికి ఎవ‌రైనాస‌రే భ‌య‌ప‌డుతున్నారు. అందుకే ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. వర్షంలో త‌డిసిన‌ తర్వాత అజాగ్ర‌త్త వ‌హిస్తే ప‌లు వ్యాధులు చుట్టుముడ‌తాయి. ఇవి కరోనా వైరస్ ల‌క్ష‌ణాల మాదిరిగానే ఉంటాయి. వర్షంలో బాగా త‌డిసిన తర్వాత జలుబు, జ్వ‌రం, దగ్గు మొద‌లైన సమస్యలు వస్తాయి. బలమైన రోగనిరోధక శక్తి లేని వారికి జలుబు, దగ్గు పట్టుకున్న వెంటనే జ్వరం కూడా వ‌చ్చి బాధపడుతుంటారు. ఇంతేకాకుండా వర్షంలో త‌డిసిన‌ తర్వాత తలనొప్పి, చర్మ అలెర్జీ మరియు కంటి వ్యాధుల‌ ప్రమాదం కూడా పొంచివుంది. వర్షంలో త‌డిసి, ఇంటికి చేరుకున్న వెంట‌నే ఏమి చేయాలో తెలుసుకుందాం.

త‌ల‌ను తుడుచుకోండి
మ‌న త‌లపై ముందుగా వర్షపు నీరు ప‌డుతుంది. మన శరీరం యొక్క మొత్తం పనితీరు తల ద్వారానే నెర‌వేరుతుంది. తల భాగం చాలా సున్నిత‌మైన‌ది. అందుకే వ‌ర్షంలో త‌ల త‌డ‌వ‌కుండా చూసుకోవాలి. వ‌ర్షంలో వెళ్లేట‌ప్పుడు గొడుగును త‌ప్ప‌క వినియోగించాలి. ఒక‌వేళ వ‌ర్షంలో త‌డిసిపోయి ఇంటికివ‌స్తే వెంట‌నే త‌ల‌ను పొడి ట‌వ‌ల్‌తో శుభ్రం చేసుకోవాలి.

వెంట‌నే దుస్తులు మార్చుకోండి
వర్షంలో త‌డిసి, ఇంటికి చేరుకున్న వెంటనే దుస్తులు మార్చుకోండి. ఇలా చేయడం ద్వారా, మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. మరియు చలిగా అనిపించదు. వర్షాకాలంలో అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. బట్టలు వెంటనే మార్చుకోవ‌డం వల్ల, దానిపై ఉన్న ఫంగస్ వ్యాప్తి చెందదు.

యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోండి
వర్షంలో త‌డిసిన‌ తర్వాత దుస్తులు మార్చుకునేముందు శరీరమంత‌టికీ యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంపైనున్న‌ బ్యాక్టీరియా చనిపోతుంది. చర్మ అలెర్జీ నుండి రక్షణ పొందుతారు. ఇంతేకాదు యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవ‌డం ద్వారా దురద, మంట లాంటి స‌మ‌స్య‌లు ఎదురుకావు.

వేడి టీ లేదా పానీయాల‌ను త్రాగాలి
వర్షంలో త‌డిసిన‌ తర్వాత ఖచ్చితంగా వేడి టీ లేదా పానీయాల‌ను తాగాలి. ఇది మీ శరీరం యొక్క శక్తిని పెంచడమే కాక, వర్షంలో నాన‌డం వల్ల పడిపోయిన‌ ఉష్ణోగ్రతను మెరుగుప‌ర‌చ‌డంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దానితో పాటు తుల‌సి లాంటి కషాయాలను తీసుకోవడం మరింత ప్రయోజనాల‌ను క‌లిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు మీరు జలుబు, దగ్గు మరియు ఫ్లూ లాంటి స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉంటాయి.

పాదాలను ప‌రిశుభ్రం చేసుకోవాలి
వర్షాకాలంటో బూట్లు ధరించ‌డం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చెప్పులు‌ ధరించి వర్షంలో వెళ్లేవారికి అనేక వ్యాధుల ప్రమాదం పొంచివుంటుంది. వర్షాకాలంలో చెప్పులు ధరించినపుడు పాదాల వేళ్లు ఒరి‌సిపోతుంటాయి. అటువంట‌ప్పుడు వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే, చీము కూడా ప‌ట్టేప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. వర్షంలో త‌డిసి, ఇంటికి చేరుకున్న వెంటనే పాదాలను ప‌రిశుభ్రంగా క‌డుక్కోవాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles