31.8 C
Amaravathi
Wednesday, June 23, 2021
spot_img

పీరియ‌డ్స్ మిస్సింగ్‌… ఇవీ కార‌ణాలు కావ‌చ్చు!

పీరియడ్స్‌ వచ్చినప్పుడు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాగే పీరియడ్స్ రాన‌పుడు వారి టెన్షన్ మ‌రింత‌గా పెరుగుతుంది. అయితే పీరియ‌డ్స్ రాలేద‌న‌గానే మొద‌ట వినిపించే కార‌ణం గర్భం దాల్చ‌డం. అయితే పీరియ‌డ్స్ ఆగిన ప్రతిసారీ ఇదే కార‌ణం కాదు. వివాహమైన మ‌హిళ‌లు గర్భం రాకుండా ఉండటానికి గ‌ర్భ‌నిరోధ‌క మాత్రలు తీసుకుంటుంటే పీరియ‌డ్స్‌ కూడా సక్రమంగా వ‌స్తాయి. అలాగే పీరియ‌డ్స్ వెంట‌నే రాకుండా ఉండేందుకు త‌గిన మాత్ర‌లు తీసుకున్న‌ప్పుడు పీరియ‌డ్స్ వ‌చ్చే స‌మ‌యం పెరుగుతుంది. ఇవే కాకుండా పీరియ‌డ్స్ ఆగిపోయేందుకు, ఆల‌స్యంగా వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలున్నాయి. వాటిపై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఒత్తిడి వ‌ల‌న‌
ఏ కారణం చేతనైనా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌ప్పుడు ఇది మీ హార్మోన్లను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఫ‌లితంగా రెండు పీరియ‌డ్స్‌ మధ్య అంతరం పెరుగుతుంది. మెదడులో ఉండే హైపోథాలమస్ పీరియ‌డ్స్‌ను క్రమబద్ధీకరించడానికి పనిచేస్తుంది. ఒత్తిడి అనేది హైపోథాలమస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా మహిళలకు పీరియ‌డ్స్ స‌క్ర‌మంగా రాక‌పోవ‌డానికి తోడు శరీర బరువు కూడా వేగంగా పెరుగుతుంది.

పిసిఒడి మరియు పిసిఒఎస్…
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఓడి) సమస్య కూడా పీరియడ్స్ స‌క్ర‌మంగా రాక‌పోవ‌డానికి దారితీస్తుంది. ఈ సమయంలో, అదనపు ఫోలికల్స్ ఏర్పడతాయి. ఫ‌లితంగా పీరియ‌డ్స్‌ కాలాల సాధారణ ప్రక్రియ దీర్ఘకాలానికి మారుతుంది.

డయాబెటిస్ లేదా థైరాయిడ్…
డయాబెటిస్ లేదా థైరాయిడ్ వ్యాధి కూడా పీరియడ్స్ రాకపోవడం లేదా ఆలస్యం కావడానికి కార‌ణంగా మారుతుంది. థైరాయిడ్ కారణంగా పీరియ‌డ్స్ స‌మ‌యాలు చాలా తక్కువ లేదా ఎక్కువ కాలాల‌కు మారిపోతాయి. మ‌రికొంద‌రిలో ఈ వ్యాధుల‌ కారణంగా కూడా పీరియ‌డ్స్ ఆగిపోతాయి.ఇటువంటి పరిస్థితిని అమెనోరియా అంటారు.

50 ఏళ్ళ వయసులో…
మోనోపాజ్‌ అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ చోటు చేసుకుంటుంది. ఇటువంటి పరిస్థితిలో మహిళలకు పీరియడ్స్ ఆగిపోవ‌డం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా, వారి శరీరంలో చాలా వేగంగా హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. మహిళలకు సాధారణంగా 45 సంవత్సరాల తర్వాత మోనాపాజ్ లక్షణాలు ఎదుర‌వుతాయి. కొంతమంది మహిళలకు 45 ఏళ్లలోపే పీరియ‌డ్స్ ఆగిపోతాయి. ఇది కూడా ఒక రకమైన సమస్య. దీని పరిష్కారం కోసం వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles