26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

ఈ ఇమ్యూనిటీ బూస్ట‌ర్ డ్రింక్‌తో వ్యాధులు దూరం !

జలుబు, ద‌గ్గు త‌దిత‌ర సాధారణ అంటువ్యాధుల నుంచి మనల్నిమ‌నం రక్షించుకోవాల‌నుకుంటే మ‌న‌కు రోగ‌నిరోధ‌క‌శ‌క్తి ఎంతో అవ‌స‌రం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాపంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనాకు దూరంగా ఉండాల‌న్నా, ఆ వ్యాధి సోకి, త్వ‌ర‌గా కోలుకోవాల‌న్నా బ‌ల‌మైన రోగ‌నిరోధ‌క‌శ‌క్తి ఎంతో అవ‌స‌రం. అందుకే ఇంట్లోనే అత్యంత సుల‌భంగా త‌యారు చేసుకోగ‌ల, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పానీయం గురించి తెలుసుకోండి. ఇది రోగనిరోధక శక్తిని ఎలా బలోపేతం చేస్తుందో కూడా తెలుసుకోండి.

స్ట్రాబెర్రీ, మామిడి పానీయం
రోగనిరోధక శక్తిని పెంచే పానీయం సిద్ధం చేయడానికి స్ట్రాబెర్రీస్‌ మరియు మామిడి పండ్లు అవసరం. ఈ రెండు ర‌కాల పండ్లు మార్కెట్లో లేదా మీ ఇంటి ద‌గ్గ‌రున్న‌ పండ్ల దుకాణంలో సుల‌భంగా దొరుకుతాయి. వీటిని కొనుగోలు చేశాక‌ వెచ్చని నీటిలో కనీసం 10 నుండి 15 నిమిషాలు ఉంచ‌డం ద్వారా వాటిపై ఉండే హానికరమైన వైరస్‌లు లేదా బ్యాక్టీరియా అంత‌మ‌వుతుంది.

ఇప్పుడు మామిడిపండ్ల‌ తొక్కను తీసి, ముక్క‌లుగా చేసుకోండి. త‌రువాత స్ట్రాబెర్రీలను చిన్నచిన్న‌ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ జ్యూసర్‌లో వేసుకుని, దానిలో ఒక కప్పు నీరు పోసి, కనీసం 5 నిమిషాలు బాగా తిప్పాలి. దీనిని స్మూతీగా తీసుకోవ‌చ్చు. కావాల‌నుకుంటే దానిలో ఎండుద్రాక్ష లేదా మీకు ఇష్టమైన డ్రైఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోవ‌చ్చు‌. ఇప్పుడు మీ రోగనిరోధక శక్తి బూస్టర్ పానీయం సిద్ధమ‌య్యింది.

దీనితో రోగనిరోధక శక్తి ఎలా బ‌లోపేతం?
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మామిడి మరియు స్ట్రాబెర్రీలను కలిపి తీసుకోవడం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వేసవిలో ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిని తాగిన తర్వాత శక్తి అందుతుంది. అలాగే దీనిని తాగ‌డం ద్వారా వ్యాధి రోగనిరోధక శక్తి బ‌లోపేతం అవుతుంది. మామిడి మరియు స్ట్రాబెర్రీ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పెద్ద‌మొత్తంలో కనిపిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. అందుకే మామిడి మరియు స్ట్రాబెర్రీ పానీయాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles