22.9 C
Amaravathi
Thursday, December 9, 2021
spot_img

గూగుల్‌ పే బ్యాన్‌… ఎన్‌పీసీఐ క్లారిటీ

భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో వ్యాపిస్తున్న వ‌దంతుల‌పై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) వివ‌ర‌ణ ఇచ్చింది దీనిపై ఎన్‌పీసీఐ స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్ల‌డించింది. ఇంత‌కుముందు గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన వ‌దంతుల‌పై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తున్న‌ద‌ని తేల్చి చెప్పింది. తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తున్న‌ద‌ని వివ‌రించింది.

గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని స్ప‌ష్టం చేసింది. గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని ఆర్‌బీఐ తెలిపింది. అయితే గూగుల్‌ పే కార్యకలాపాలు చెల్లింపులు- పరిష్కారాల చట్టం- 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది.

దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఈ గూ‌గూల్ పేను ఉపయోగిస్తున్నారు. బిల్స్, రీచార్జులు, పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ త‌దిత‌ర‌ సేవల్ని గూగుల్ పే అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంద‌ని స‌మాచారం. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు గూగుల్ పే యాజమాన్యం తెలిపింది. ఇందు కోసం ఈ సంస్థ ఇండియాలోని టాప్ లెండర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

గుగూల్ పే ఫ్లాట్ ఫామ్‌ ద్వారా తక్కువ వడ్డీకి మొదట ఓ 30 లక్షల మంది వరకూ ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇప్పటికే కన్స్యూమర్ లోన్స్ ఇచ్చేందుకు యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకున్న‌ద‌ని తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles