22.9 C
Amaravathi
Thursday, December 9, 2021
spot_img

మ‌దురుతున్న ప‌తంజ‌లి క‌రోనా ఔష‌ధ వివాదం…

కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో విముక్తి దొరుకుతుందంటూ పతంజలి సంస్థ ఒక ఔష‌ధాన్నిప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. తాము తయారు చేసిన కోరోనిల్ కిట్‌తో మూడు నుంచి ఏడు రోజుల్లో కరోనా మహమ్మారిని తరిమేయవచ్చంటూ పేర్కొంది. అయితే పతంజలి సంస్థ క‌రోనిల్ పేరుతో ప్రజల‌ను మోసం చేస్తున్న‌దంటూ పలువురు కేసులు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన కొంత‌మంది రాందేవ్ బాబాపై, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పతంజలి సీఈవోతో పాటు.. యోగా గురువు రాందేవ్ బాబాపై చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. వీరిద్దరితో పాటు వీరికి ‌హ‌క‌రించిన వీరికి మరో ముగ్గురిపైన కూడా కేసులు నమోద‌య్యాయి.

కోరోనిల్ టాబ్లెట్‌తో కరోనా మహమ్మారికి చెక్ పెట్టవంచంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని వారు పోలీసుల‌కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జ్యోతినగర్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. కోరోనిల్‌ పేరుతో పతంజలి ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశామని తెలిపారు. యోగా గురువు రాందేవ్‌ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్‌, నిమ్స్‌ చైర్మన్‌ బల్బీర్‌ సింగ్‌ తోమర్‌, నిమ్స్‌ డైరక్టర్‌ అనురాగ్‌పై చీటింగ్‌ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఇదిలావుండ‌గా కోరోనిల్ ఔషధంపై కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. దీని శాస్త్రీయత గురించి నిర్ధారించాలని, అంత‌వ‌రకూ‌ దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. పతంజలి ఆయుర్వేద ఔష‌ధం కొరొనిల్‌తో కరోనా వైరస్ రోగులపై ట్రయల్స్ నిర్వహించినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ.. రాజస్థాన్ ఆరోగ్య శాఖ జైపూర్‌లోని నిమ్స్ ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ ఆసుపత్రి తన చర్యకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతిని కోరలేదని, ఇలా చేస్తున్నట్టు సమాచారాన్ని కూడా ఇవ్వలేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ తెలిపారు. ఆయుష్ శాఖ అనుమతి లేనిదే ఈ మందును తమ రాష్ట్రంలో రోగులకు వాడరాదని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ మందును అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ హెచ్చరించారు. అటు-ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేయనుంది. దగ్గు, జ్వరాన్ని నివారించి రోగనిరోధక శక్తిని పెంచే మందుకు లైసెన్సు కావాలని మాత్రమే ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంద‌ని ప్రభుత్వం పేర్కొంది. కాగా బీహార్‌లో కూడా ఓ వ్యక్తి ఈ మందుపై కోర్టులో పిటిషన్ వేశారు. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ లక్షలాది కరోనా రోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, పతంజలి సంస్థపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 30 న కోర్టులో విచారణ జరగనుంద‌ని స‌మాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles