Home ఆరోగ్యం బెల్లం, జీల‌క‌ర్ర క‌లిపితింటే ఈ వ్యాధులు దూరం !

బెల్లం, జీల‌క‌ర్ర క‌లిపితింటే ఈ వ్యాధులు దూరం !

0

జీలకర్రను త‌ప్ప‌నిస‌రిగా ఇంట్లో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా కూర‌లు వండేట‌ప్పుడు వాటిలో వేస్తుంటాం. అదేవిధంగా బెల్లాన్ని వివిధ రకాల స్వీట్స్ త‌యారీలో ఉపయోగిస్తుంటాం. అయితే బెల్లం, జీలకర్ర కలిపి తీసుకుంటే అది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? ఈరెండింటి కాంబినేష‌న్‌‌తో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి…
అధిక బ‌రువు కార‌ణంగా‌ టైప్ -2 డయాబెటిస్ ముప్పు పెర‌గ‌డానికి తోడు, అనేక రకాల క్యాన్సర్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని శాస్త్రీయ ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. జీలకర్రను నాన‌బెట్టి దానిలో, బెల్లం వేసుకుని తింటే, ఇది బరువు తగ్గడానికి సమర్థవంతంగా సహాయపడుతుంది.

రక్తహీనత ముప్పు నివార‌ణ‌కు
రక్తహీనత సమస్యను ప్రధానంగా గర్భధారణ స‌మ‌యంలో మహిళలు ఎదుర్కొంటుంటారు. బెల్లంలో ఐర‌న్ పుష్క‌లంగా ఉన్న కార‌ణంగా దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటే రక్తహీనత ప్రమాదాన్ని చాలా వ‌ర‌కూ తగ్గించవచ్చు. అదేవిధంగా బెల్లం, జీలకర్ర క‌లిపి తినడం వ‌ల‌న‌ రక్త ప్రసరణ మెరుగుప‌డుతుంది.

అధిక రక్తపోటు త‌గ్గించేందుకు
అధిక రక్తపోటు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక రకాల వ్యాధులు, ప‌క్ష‌వాతం కూడా వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది. జీలకర్ర, బెల్లంల‌లో పుష్క‌లంగా పొటాషియం, మెగ్నీషియం ఉన్న కార‌ణంగా వీటిని తీసుకున్న‌ప్పుడు అధిక రక్తపోటు సమస్య చాలావ‌ర‌కూ త‌గ్గుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి, వారి సూచ‌న మేర‌కు జీలకర్ర, బెల్లం తీసుకోవాలి.

ఎముకలు గ‌ట్టిప‌డేందుకు
ఎముకలు గట్టిపడేందుకు కాల్షియం పోషకాలు ఎంతో అవసరం. జీలకర్ర, బెల్లంల‌ను క‌లిపి తీసుకోవడం వ‌ల‌న ఎముకలు గ‌ట్టిప‌డేందుకు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం ఈ రెండు ఆహారాల‌లో ఎముకలను గ‌ట్టిప‌రి‌చే లక్షణాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనల ద్వారా ఇది నిర్థారిత‌మ‌య్యింది. అందువల్ల జీలకర్ర మరియు బెల్లం కాంబినేష‌న్ వృద్ధులకు, క్రీడలలో పాల్గొనే పిల్లలకు మ‌రింత ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె జబ్బుల నుండి ర‌క్ష‌ణ‌కు
గుండె జబ్బుల కార‌ణంగా ప్రతియేటా చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. భారతదేశంలో అలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివ‌రాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మ‌ర‌ణాలు గుండె జబ్బుల కార‌ణంగానే సంభవిస్తున్నాయి. బెల్లం మరియు జీలకర్రల‌ను తీసుకోవడం వ‌ల‌న‌ గుండె జబ్బుల ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. నిజానికి బెల్లం మరియు జీలకర్ర రెండూ కార్డియోప్రొటెక్టివ్ చర్యను కలిగి ఉంటాయి. ఇది గుండెకు సంబంధించిన అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని చాలా రెట్లు త‌గ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి కోసం…
జీలకర్ర, బెల్లం క‌లిపి తీసుకోవడం వ‌ల‌న రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఈ రెండు ఆహారాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని ప్రత్యక్ష ప్రభావం రోగనిరోధక కణాల బలోపేతానికి దారితీస్తుంది. అదే విధంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల‌న అనేక రకాల అంటువ్యాధుల నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఉద‌ర‌ సమస్యల నివార‌ణ‌కు…
శరీరానికి సంబంధించిన ఆరోగ్య స‌మ‌స్య‌లు కడుపు నుంచే మొదలవుతాయి. శరీరంలోని అన్ని అవ‌య‌వాల ప‌నితీరు జీర్ణవ్యవస్థ స‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పై ఆధార‌ప‌డివుంటుంది. జీల‌క‌ర్ర‌, బెల్లం కలిపి తీసుకోవ‌డంవ‌ల‌న శ‌రీరానికి వివిధ రకాల పోషకాలు అందుతాయి. ఫ‌లితంగా మన శరీరం స‌మ‌ర్థ‌వంతంగా పనిచేస్తుంది. వీట‌న్నింటి దృష్ట్యా క‌డుపు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. జీలకర్ర, బెల్లంలో ఫైబర్ అధికమొత్తంలో ఉన్నందున, దీనిని తీసుకోవ‌డం వ‌ల‌న జీర్ణక్రియ సజావుగా జ‌రుగుతుంది. అనేక రకాల ఉద‌ర‌ సమస్యలు దూర‌మ‌వుతాయి.

జలుబు, దగ్గు ఫ్లూ నుండి దూరంగా ఉండేందుకు
జీలకర్ర మరియు బెల్లం కాంబినేష‌న్ జలుబు, దగ్గు మరియు ఫ్లూతో బాధపడేవారికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. బెల్లం వేడిని క‌లిగ‌జేస్తుంది. జలుబు మరియు దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇటువంటి ఆహారాలు ప్రభావవంతంగా ప‌నిచేస్తాయి. జీల‌క‌ర్ర‌ తినడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ మొద‌లైన‌ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గుతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు చిన్న ముక్క అల్లంతో పాటు బెల్లం ముక్క క‌ల‌పి తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది.

Exit mobile version