37.2 C
Amaravathi
Wednesday, June 23, 2021
spot_img

జీవ‌క్రియ‌ను ప్రేరేపించే ల‌వంగాల పానీయం తాగుతున్నారా..?

లవంగం అనేది ప్రతి భారతీయుల‌ వంటగదిలో కనిపించే ఒక మసాలా దినుసు. దీనికున్న‌ ప్రత్యేక రుచి, వాసన కారణంగా అనేక ఆసియా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. లవంగాన్ని అంద‌రి ఇళ్లలో దాదాపు ప్రతిరోజూ ఉపయోగిస్తారు. అయితే ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అంద‌రికీ తెలియ‌దు. ఈ సుగంధాల‌ మసాలా దినుసు మ‌న శ‌రీరంలో అద‌నంగా పెరిగిన కొవ్వును క‌రిగించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ల‌వంగాల‌లో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ల‌వంగాలు ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా అనేక వ్యాధులను కూడా త‌రిమికొడ‌తాయి. ల‌వంగాల‌ను వినియోగిస్తూ ఊబకాయాన్ని ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగం శరీరపు జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మసాలా దినుసు యాంటీకోలెస్టెరిక్ మరియు యాంటీ లిపిడ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ శక్తివంతమైన మసాలా దినుసును మిరియాలు, దాల్చినచెక్క మరియు జీలకర్రతో కలిపినప్పుడు, ఇది మన జీవక్రియ రేటును వేగంగా పెంచడానికి సహాయపడుతుంది. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తక్కువ ఆక్సీకరణ ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లవంగాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఈ ల‌వంగాల పానీయం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లవంగాల పానీయం త‌యారు చేయ‌డానికి 50 గ్రాముల లవంగాలు, 50గ్రాముల దాల్చినచెక్క, 50 గ్రాముల జీలకర్ర అవ‌స‌రం. వీటిన‌న్నింటినీ పొడిగా ఒక పాన్‌లో బాగా వేయించుకున్న త‌రువాత మొత్త‌గా పొడిచేసుకుని, గాలి చొర‌బ‌డ‌ని ఒక గాజు సీసాలో భ‌ద్ర‌ప‌ర‌చుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక‌ టీస్పూన్ ఒక గ్లాసు నీటిలో మ‌రిగించి, చల్లబరచండి. దానిలో ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ విధంగా త‌యారైన పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి. అయితే సుగంధ ద్రవ్యాల అలెర్జీ ఉన్నవారు, బరువు తగ్గడానికి ఈ పానీయాన్ని తాగాల‌నుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. లవంగాలలో యూజీనాల్ ఉండటం వల్ల ఇది అలెర్జీని ప్ర‌తిఘ‌టిస్తుంది. అయితే బరువు తగ్గడానికి ఈ ఒక్కటే స‌హాయ‌ప‌డ‌దు. దీనితో పాటు, రెగ్యులర్ వ్యాయామం తీసుకోవ‌డంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అప్పుడే స‌త్ఫ‌లితాలు అందుతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles